Jump to content

పుట:PandugaluParamardhalu.djvu/72

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మహారాష్ట్రుల నమ్మకాలు

      'కొధారి ' అనువారు మహారాష్ట్రులలో ఈ పండుగకు సంబంధించిన కొన్ని నమ్మకాలను ఇట్లా వివరిస్తున్నారు.  "హరిదాసు రామస్తోత్రాన్ని పాడుతూ ఉంటే అక్కడ హనుమంతుడు మనుష్య రూపంలో అదృశ్యుడై ఉంటాడని మహారాష్ట్రుల నమ్మకం".
    హనుమంతుని స్తుతించే హనుమత్కవచాన్ని ఆంజనేయుని ఆలయంలో లక్ష ఇరవై అయిదు వేలసారులు పఠించినవారికి గాలిలో ఎగిరేశక్తి అణిమాద్యష్ట సిద్దులు లభ్యమౌతాయి అని చెబుతారు.
    శని గ్రహపీడగల మహారాష్ట్రులు హనుమంతుని శరణు పొందుతారు.  శని కులం చేత తెలకులవాడు. శనివారం అతనికి ప్రియమైంది.  అందుచేత మహారాష్ట్రులు శనిపీడ తొలగడానికి మంచి నూనెను  Minimum or red lead and udid pulse (Phaseslous radiatus) rin  చెట్టు పువ్వులతో, ఆకులతో శనివారంనాడు హనుమంతునికి సమర్పిస్తారు.
    ప్రేతపత్రి ఐన శంకరుడికి బూతాల మీద ఎట్టి ఆధిపత్యం ఉందో హనుమంతుడికి కూడా అట్టి ఆధిపత్యం ఉందని మహారాష్ట్రుల నమ్మిక.  శివాజీ గురువైన సమర్ధ రామదాసు హనుమంతుని భక్తుడుకాగా మహారాష్ట్రుల జెండామీద గదాపాణి అయిన హనుమంతుడు వెలిశాశు.  అర్జునిడి జెండామీద ఉపవిష్ణుడై హనుమంతుడు మహాభారతయుద్ధంలో అర్జునిడికి రక్షణయిచ్చి ఉందిన గాధ పలువురకు తెలిసిందే.
                     ఆంధ్రులు - ఆంజనేయుడు
     హనుమంతుని గుఱించి పొరుగువారైన మహారాష్ట్రులకు గల పై నమ్మికలు ప్రాయకంగా ఆంధ్రులకు కూడా ఉన్నాయి.
   గ్రహపీడలకు మనము ఆంజనేయుల్ని కొలుస్తాము.  కొన్ని రకాల ఉన్మాదరోగాలకు ఆంజనే ప్రదక్షిణలు విదిస్తాము.  చిన్నపిల్లలకు ఆంజనేయిని బ్నొమ్మ చెక్కిన యంత్రపు బిళ్లమడలో కట్టడం మనలో విశేష ప్రచారంగల ఆచారమయ్యే ఉంది.  పెద్దలు కూడా భయసమయాల్లో ఆపత్కాలాల్లో ఆంజనెయదండకం చదువు కోవడం ఆంధ్రదేశంలో చిరకాలంగా వస్తూ ఉన్న సంప్రదాయం.
    మనశాస్త్రాల్లో భగవంతునికి తొమ్మిది విధాలైన పూజలు నిర్ణీతమై