పుట:PandugaluParamardhalu.djvu/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"వత్సరాదినాడు పంచాంగ శ్రవణము మహాఫలప్రదము. నూతన సంవత్సరమునందు గలుగబోయెడి ఫలాఫలములు ఆదాయ వ్యయములు, గ్రహచారములు మొదలగుననేక విషయ ములు ముందుగా దెలిసికొని దగినవిగా నుండున్. ఇక ముందు సంవత్సరము పొడుగునను ఆచరింపదగిన శ్రౌత స్మార్తాది కర్మముల కన్నిటికిని కాలవిశేషములను దెలియజేయునది పంచాంగమే గనుక ఆ నూతన సంవత్సర పంచాంగమును బూజించి వత్సరాదినాడే భగవత్సన్నిధాననమున వినిపించి తామును శ్రవణము చేయవలయును. కనుకనే

శో: శ్రీ కళ్యాణ గుణాసహం రిపుహరం దుస్వప్న దోషాపహం
    గంగాస్నాన విశేష పుణ్యఫలదం గొదానతుల్యం నృణాం
    ఆయుర్వద్దిద ముత్తమం శుచికరం సంతాన సంపత్తృదం
    నానా కర్మసుసాధనం సముచితం పంచాంగ మాకర్జ్యతాం
    అని పంచాంగ శ్రవణమునకు ఫలశ్రుతి చెప్పబడినది.

    ఉగాదినాడు చేయవలసిన మరి ఒక విధాయక కృత్యము ప్రస్తాదాన ప్రారంభం.
    ప్రప అనగా చలిపందిరి.  ప్రసాదాన మనగా చలివేంద్రం పెట్టి దాహతీర్ధములు ఇవ్వడం. అట్లా ఇవ్వడానికి సంవత్సరాదినుంచి ప్రారంభం చేయాలి.
   సంవత్సరాది వసంతఋతువుకు మొదతి దినం. వసంత ఋతువు పైబడ్డ కొద్దీ ఎండలు మెండై గ్రీష్మఋతువులో భరింపరానివిగా ఉంటాయి.  కాగా ఈ రోజులలో దప్పిక కొన్నవారికి దాహతీర్ధాలు ఈయడం పుణ్యకార్యము.  ప్రతివారు చలివేంద్రాలు పెట్టలేదు.  యధాశక్తిని దాహతీర్ధాలు ఇస్తూ ఉండాని.

      "సలిలమున నిల్చు భ్రాణము సలిలదాత
       ప్రాణదాత యనంబడు"
       మధుసుమాసంబు మొదలుగా మంచినీళ్లు
      చల్లతోగల్పి పానీయశాలగట్టి
      పోయువారల పుణ్య్హంబు పోలు వారలు
      భయలోకంబులందును శుభము గండ్రు - శేష ధర్మము