ఈ పుటను అచ్చుదిద్దలేదు
విష్ణుమూర్తి పది అవతారాలలో నరసింహావతారము నాలుగోది.
హిరణ్యకశిపుడు రాక్షసరాజు, అతని భార్య లీలావతి, ఆమె గర్భవతి అయివుండగా హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళెను. అదే మంచి అదనని దేవతల రాజు ఇంద్రుడు రాక్షస సంహారానికి ప్రారంభించెను. లీలావతి గర్భమందున్న పిండమును కూడ చంపడానికి అతడు ప్రయత్నించెను. అప్పుడు నారదుడు అడ్డుపడి ఆమెను తన ఆశ్రమానికి తీసుకువెళ్లి కాపాడాడు. ఆమె గర్భస్థశిశువుకు అతడు విష్ణుభక్తి బోదించాడు.
తపస్సు వలన బ్రహ్మను మెప్పించి హిరణ్యకశిపుడు తనకు నరులచేకాని, మృగములచేకాని, పగలుకాని, రాత్రికాని, ప్రాణమున్న వానిచేకాని, ప్రాణము లేనివానిచే కాని చావులేకుండేటట్లు వరాలు పొందాడు.
ఆమీద అతడు ఇంటికి తిరిగు వచ్చాడు. తాను లేనప్పుడు తన భార్యను అరసి రక్షించినందుకు నారదునకు కృతజ్ఞత తెలిపి భార్యను ఇంటికి తీసుకువెళ్లాడు. పుట్టిన బిడ్డడికి ప్రహ్లాదుడు అని పేరు పెట్టాడు.
వరగర్వంతొ అతడు దేవతలను బాధపెడుతూ వచ్చాడు. అతడు విష్ణుద్వేషి. అతని కుమారుడు విష్ణుభక్తుడు.
కొడుకు మనస్సు మార్చడానికి తండ్రి అనేక విధాల ప్రయత్నిస్తాడు. కాని కార్యంలేక పోతుంది. తుదకు ప్రాణం విసిగి తండ్రి కొడుకుని విష్ణువు ఎక్కడ ఉన్నాడు అంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు
క. ఇందుగలండందు లేడని
సందేహమువలదు చత్రిసర్వోపగతుం
డెందెందువదకి చూచిన
నందందే కలదు దానవాగ్రణి వింటే!
అంటాడు. అట్లా అయితే ఈ స్తంభంలో విష్ణువు ఉన్నాడా! అని హిరణ్యూకశిపుడు ఒక స్తంభాన్ని తన్నుతాడు. అప్పుడు ఆ స్తంభం విచ్చుపోతుంది. అందులో నుండి విష్ణుమూర్తి నరసింహరూపంతో బయటకు వెడలి వస్తాడు.
బ్రహ్మయిచ్చిన వరాలకు ప్రత్యనాయం లేకుండా సగము మనిషి సగము మృగము రూపు ధరించి పగలు రాత్రి కాని సంధ్యాకాలంలో ప్రాణం