Jump to content

పుట:PandugaluParamardhalu.djvu/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చేత అతనికి యతిరాజు అనిన్నీ పేరు వచ్చింది. రామానుజుడు శేషాంశసంబూతుడని చెబుతారు.

  ఈనాడు పుత్రప్రాప్తివ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణీ
                            వైశాఖ శుద్ధ సప్తమి
                             గంగాసప్తమి
   గంగోత్పత్తి కధను పురాణనామచంద్రిక ఇట్లు చెబుతూ ఉంది. "తన ముత్తాతలు అగు సగరపుత్రులు కపిల మహాముని యొక్క కోపాగ్ని చేత నీఱు కాగా వారికి సద్గతి కలిగింప తలంచి గంగను కూర్చి తపస్సు చేవ్సి భూలోకమునకు దిగి వఛ్చునట్లు భగీరధుడు ప్రార్దించెను.  అప్పుడు ఆ మహానది తాను భూలోకమునకు వచ్చునెడ తన ప్రవాహవేగమును భరింప గల వారిని ఒకరిని ఏర్పఱుచు కొనిన పక్షమున తాను వవచ్చునట్లు ఒప్పుకొనెను. అంటట భగీరధుడు రుద్రుని గూర్చి తపము ఆచరించి అతని అనుగ్రహము పడసి గంగా ప్రవాహమును వహింప ప్రార్ధించెను.  అపుడు గంగ మిక్కిలి అట్టహాసముతో భూమికి దిగిరాసాగెను.  రుద్రుడు గంగను తన జటా జూటంకు నందు నిలిపి పిదప కొంతకాలమునకు భగీరధుని ప్రార్ధనచే తన శిరస్సు నుండి ఏడుబిందువులను భూమిమీదకు వదలెను.  ఆబిందువులు పడిన చోటు బిందుసరస్సు. ఆ సరస్సు నుండి వెడలి ప్రవహిచుచూ గంగ జహ్నుమహాముని యజ్ఞశాలయందు ప్రవేశింపగా అతడు కోపగించి దానిని పానముచేసి, పిమ్మట భగీరధుడు ప్రార్దింపగా ప్రసన్నుడై తన చెవి నుండి వెడల విడిచెవ్ను.  ఇందువలన గంగను జహ్నవి అనుపేరు కలిగెను.
     గంగానది జాహ్నుముని చెవినుంది పుట్టిన రోజు వైశాఖశుద్ధ సప్తమి. కాగా ఈరోజున గంగానదిలో స్నానం చేసి పూజ ఛేయాలి.  శర్కరాసప్తమి, నింబాసప్తమి, అనోదనసప్తమె, ద్రాదశసప్తమి మున్నగు వ్రతాలు ఈనాడు చేస్తారని చతుర్విధ చింతామణి.
     ఈనాడు సర్జవ్యపూజ చేయాలని కూడా వ్రతగ్రంధాలు చెప్తున్నాయుఇ
                        వైశాఖశుద్ధ అష్టమి
     'దేవీపూజా ఆమ్రరసేవ ' అని స్మృతి కౌస్తుభము చెబుతూ ఉంది. దుర్గాష్టమి అని ఆమాదేర్ జ్యొతిషీ.