పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెలులను బంధులన్‌ మధుర శీధువు నామనితోఁట వీడి యూ
హలు నెగఁబ్రాకఁజాలని రహస్యపుఁ జోటికిఁ బోదువీవు; నేఁ
బలికెదఁ దెల్పరాని యొకభావము; సంధ్యలఁ దూలి రాలు పూ
వులు కృశియించుఁగాని విరఁబూయవుక్రమ్మఱ; నమ్ముమో సఖీ!

    
కాల మహర్నిశంబనెడు కత్తెరతో భవ దాయురంబర
శ్రీల హరించు; మోముపయిఁజిల్కును దుమ్ముదుమార; మేలొకో
జాలిపడంగ? నీక్షణము సంతసమందుము; నీవువోదు; వీ
రేలుఁ బవళ్లు మున్నటు చరించు నిరంతర మండలాకృతిన్‌.

 
ఆమని లేఁతమబ్బులు ప్రియంబుగ రాగవతీకపోలముల్‌
తేమగిలంగఁ దుంపురిలు తియ్యనివేళల లేచిరమ్ము చా
నా, మధురాసవంబుఁ దమినానఁగ; నేఁడు విహారభూమి శో
భామయమైన యీగఱిక పచ్చగిలుంగద రేపు నీపయిన్‌!