పుట:Palle-Padaalu-1928.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాకరపువ్వొప్పునే

1. పల్లవి: కాకర పువ్వొప్పునే? గౌరమ్మ కాకర పండోప్పునే ౹౹గౌ౹౹
మిత్రం - కాకర, పువువాద | వాలిన చిలుకలు
వసంత రేకులు, గైకో గబ్బలు
మెకో మేడలు, చందమామ నీడలు
సవరపు దండలు !
ఆగడియలో శ్రీగడియలు——
దంచిన పాలు ! ధరణికి లొంగవు,
దానత్త బోసిన | పట్టెళ్ళు
కో; కో; తడపలు | రాముడుయ్యలు |
గంటసిరి మువ్వలు | గౌరమ్మా ! నీసుతుడేడే ?
వాడిన పువ్వులు, వడిలో బోనుక
వాడలు నెలికిన ! లేడమ్మా !
నరి, మేడలు నెలికిన | లేడమ్మా.
2. చిక్కుడు పువ్వొప్పనే? గౌరమ్మ | చిక్కుడు కాయొప్పనే
మిత్రం - చిక్కుడు పువుమీద | వాలిన చిలుకలు -
(పై మాదిరిగా మిగిలినది పాడవలయును)
3. బీరయ్య పువ్వొప్పునే ? గౌరమ్మ బీరయ్య నిందోప్పునే
మిత్రం - బీరయ్య పువుమీద, వాలిన చిలుకలు——

(పై మాదిరిగా- మిగిలినది పాడవలయును)

52