పుట:Palle-Padaalu-1928.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వచ్చెరా పొలిగాడు - వరగాలి మీద ౹౹వలియొ౹౹
దండె గట్లలోన - దాగెరా పొలిగాడు "
రావేలు గలవాడ - రార పొలిగాడ "


పొలిపాటలో కొలిమి ప్రశంస వచ్చినది. ఇది స్రక్షిప్తమయినా కావచ్చును. అయినా ఎంత చక్కని వర్ణన ! పడుగుల వంటిపిమ్మత వెట్లు నాగలి చరిచిన నప్పుడు కావచ్చును. లేచేటి రవ్వలు చుక్కలు . . . నూర్పు పనిలో కుటుంబము వారంతా చెయ్యివేస్తారు. ఈ సన్నివేశమే "శ్రీరాము గోర్రు బట్ట, సీత ఎండబెట్టు " ననికుంది. రంభయనగా అందపు ఒట్టు, భార్యయనే అర్థము చెప్పుకోవాలె.

21