పుట:Palle-Padaalu-1928.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురూ

విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురూ
అన్నదమ్ములంట
         ఈ భూదేవీ ఆకాశ వాణికీ
         వారి కర్తలంట
వారి మహిమతో చేసిరీ ఒక
మట్టి బొమ్మనంట
         ఈ తొమ్మిది కిటుకుల దర్వాజాలూ
         మాట లాడుకుంట ౹౹విష్ణు౹౹
వస్తా వట్టిదె పోతా వట్టిదె
ధర్మము తన వెంట
         సాంబశివుడు నినుపిలువ నంపినడు
         జల్దిగ రమ్మంట ౹౹విష్ణు౹౹
చేతులో బెల్లం ఉన్నంత సేపే
కాకి బలగమంట
         చేతిలో బెల్లం సరిపోయినాక
         ఎవరు రారు వెంట ౹౹విష్ణు౹౹
ఇంటి ముంగిటా పిల్ల మేకలు
ఇల్లు బలగ మంట