ఈ పుట అచ్చుదిద్దబడ్డది
గొడ్డు - గొడ్డే 648 గొడ్డే - గొద
గొడ్డుబోతుకు కాయము కొట్టు
- వ్యర్థప్రయత్నము చేయు.
- బాలింతలకు పెట్టే కారాన్ని కాయం అంటారు. అలాంటిది గొడ్రాలి కెందుకు? అనుటపై వచ్చినది. మదన. శత. 6.
గొడ్డు వీగి కన్నబిడ్డ
- ప్రథమసంతానము.
- వానిమీద ప్రేమ యెక్కువ అనుట. లేక లేక కలిగిన కొడుకు. తొలి కడుపు పంట, గొడ్రాలి తనం పోగొట్టి కలిగిన కుమారుడు.
- "గొడ్డు వీఁగి కన్నబిడ్డండు గావున." కాశీ. 4. 87.
- "గొడ్డు వీఁగి కనిన కొడుకుగారాము." పండితా. ద్వితీ. మహి. పుట. 167.
గొడ్డు వీగు
- సంతానవతి యగు.
- "గొడ్డు వీఁగిన యట్టి కొమ్మల కెల్ల, బిడ్డలు లే రను పెనుచింత గాని." వర. రా. అయో. పు. 336. పంక్తి. 18.
గొడ్డు వోవు
- వ్యర్థ మగు.
- "కొంత కాలంబు శూన్య మై గొడ్డు వోయె." శివ. 1. 51.
గొడ్డే రగు
- వ్యర్థ మగు./
- గొడ్డు + ఏరు.
- "ఏలా బిడ్డలు లేని యీబ్రదుకు గొడ్డే రయ్యెఁ జింతింపఁగన్." కవిక.
గొడ్డేరి తెచ్చు
- ఒక నిర్దిష్టలక్ష్యముతో తెచ్చు.
- "బొడ్డునఁ బుట్టినపాపనికే నిన్ను గొడ్డేరి తెస్తినే కోడలా!" తాళ్ల. సం. 12. 312.
గొడ్డేఱు
- 1. గొడ్డువడు.
- "ఒడ్డారించి విషంబున, కడ్డము చనుదెంచి కావ నధికులు లేమిన్, గొడ్డేఱి మ్రందిరి." భాగ. స్క. 8. 217.
- 2. గుత్తకు తీసుకొను.
- "బొడ్డుపల్లెను గొడ్డేఱి మోసపోతి." శ్రీనాథుని చాటువు.
గొడ్డేఱుగ
- వ్యర్థముగా.
- "నీ పడ్డపాటు గొడ్డేఱుగ జిడ్డు పఱుపం గలవారమె?" హర. 2. 132.
గొడ్రాలు
- బిడ్డ పాప లేనిది. పాండు. 3. 128.
- "గొడ్రాలి కేం తెలుసు బిడ్డకుట్లు?" సా.
గొద గొద
- వైరము.
- "ఆ రెంటి కేల గొదగొద వొడమెన్." వేం. పంచ. 3. 99.
గొద గొను
- విజృంభించు, త్వరపడు ఇత్యాది