ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కూటి____కూటు 504 కూటు___కూడ
- కూటికి కూడ లేని వాడనుట.
- "జారో,పాంతముల జేర్ప నాత డ, నంతవ్యథ గూటిబీద యై నెవ్వ గలన్." శుక. 3. 352.
- దరిద్రుడు, అన్నాతురుడు. పాండు. 4. 158.
- చూ. కూటిపేద.
కూటిలో మట్టి పోయు
- జీవనాధారము పోగొట్టు. కూడు ప్రధానం గనుక అదే జీవనానికి సంకేత మయినది. అందులో మన్ను పోయడం అనుభవదూరం చేయడమే.
- "నా కూటిలో మట్టి పోస్తే నీ కేం వస్తుంది? లేనిపోని వన్నీ కల్పించి నామీద అధికార్లతో చెబుతున్నా వని విని నీ దగ్గిరికి వచ్చాను." వా.
కూటివెచ్చము
- తిండిఖర్చు.
- "కూడినధన మెల్ల గూటివెచ్చంబు." గౌర. హరి. ప్రథ. పంక్తి. 1499.
కూటువమూక కూర్చు
- వీరులను ఏరి కాక దొరికిన వారి నందరినీ సైన్యముగా ప్రోగు చేయు.
- మందవేయు అనుట వంటిది.
- "అడవుల గొండలం బడి మహాపద రూపఱి చన్నవారి ని,ప్పుడు కొనివచ్చి కృష్ణు డొకప్రోవుగ గూటువమూక గూర్చినన్..." భార. ఉద్యో. 2.
కూటువలు గూడు
- గుంపు గూడు. రసిక. 6. 198.
- చూ. కూటువలు గొను.
కూటువలు గొను
- గుంపు కూడు.
'*"వీట గలచేడె లెల్లను....కూటువలు గొనుచు జూచిరి." భాగ. 10. పూ. 1248. కూటువసరులు
- మాయముత్యాలు వగైరాల హారము.
- "కాటుక చెదఱి కన్గవ నీరు జాఱ, గూటువ సరుల జిక్కువడ హారములు." పద్మ. 3. 21. బ్రౌన్.
కూడగట్టుకొను
- తనతో వచ్చునట్లు చేసుకొను.
- "ఊరిలోని పెద్ద లందఱినీ కూడగట్టుకుంటే కానీ, ఈ సత్రం మనం కట్టడం సాధ్యం కాదు." వా.
- చూ. కూడదీసుకొను
కూడదీసుకొను
- తమ కనుకూలముగా చేసుకొను.
- చూ. కూడగట్టుకొను.
కూడ దెచ్చుకొను
- కూడదీసుకొను; కుదుట పరచుకొను.
- "వెండియున్, జిత్తము గూడ దెచ్చుకొను జెప్పక పో దని నిర్ణయించి డ,గ్గుత్తిక వెట్టి లక్ష్మణుడు...." నిర్వ. 7. 12.