Jump to content

పుట:PadabhamdhaParijathamu.djvu/504

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుంటె____కుండ 480 కుండ____కుండ

  • న్నీలాలకభ్రాంతి గుం,టెన పొమ్మంటినొ." కాళ. శ. 16.
  • చూ. కుంటెనలు వహించు.

కుంటెన ముడి

  • తాటాకుల కట్ట కట్టే తాటిముడి. శ. ర.

కుంటెనలు వహించు

  • తార్చు.
  • ఒక నాయికదగ్గఱకు గానీ, ఒక నాయకునిదగ్గఱకు గానీ అందులో ఒకరి పక్షంగా వెళ్లి దౌత్యము నడుపు.
  • "తనసరి బాలెత ల్తనకు దాపుగ వారల కెల్ల దాను గుం,టెనలు వహించు కొంచు నెఱటెక్కులు నిండు." శుక. 3. 109.
  • చూ. కుంటెనకత్తె.

కుంటెన వుచ్చు

  • తార్చుటకై పంపు. పండితా. మహిమ.

కుండ కర్ర చేతి కిచ్చు

  • చిప్ప చేతి కిచ్చు వంటిది.
  • "కలుషము ఘటించు గుండయు గర్రయు దన, చేతి కొనగూర్చు నది గాన జెప్ప నగునె." శ్రవ. 2. 54.

కుండకూల్చిన భంగి

  • కుంభవృష్టిగా, కుండపోతగా.
  • "కుండగూల్చినభంగి, వారక వర్షంబు వఱుగొని కురియ." పండితా. ప్రథ. దీక్షా. పుట. 146.
  • చూ. కుండపోత, కుంభవృష్టి, తాడిపోత.

కుండగోకరి

  • వంటవాడు; కుండలు కడిగేవాడు.
  • "కుండగోకరి జేసి కువలయేశులకు, వండి పెట్టగ జేసి వాని నీరీతి, చీకాకుపడ మాయ సేయక యున్న, నాకేశ! వినుము నే నలునికి బంట." నలచ. 2. 700.

కుండజల జనించు

  • ఆర్ద్రత కలుగు; నీరూరు.
  • "మనసు దీరగ నొక్క మాఱు చూచిన గండ,శిలల కైనను గుండజల జనించు." పాణి. 2. 71.

కుండ పగుల గొట్టినట్లు

  • ఖరాఖండిగా.
  • "వా డేంం మాట్లాడినా కుండ పగల గొట్టినట్లు మాట్లాడతాడు." వా.
  • చూ. కుండ పగుల వేసినట్లు.

కుండ పగుల వేసినట్లు

  • వాడుకలో ఇది కుండ పగలేసినట్లు అన్నట్లు వినబడుతుంది.
  • చూ. కుండ పగుల గొట్టినట్లు.

కుండ పట్టే వాళ్లు

  • కర్మ చేసే వాళ్లు.
  • 'తల కొరివి పెట్టే దిక్కు', 'కొరివి పెట్టేవాళ్లు ఇత్యాదుల' వంటిది. అంత్యక్రియలలో పీనుగుతో పాటు ఒక కొత్త కుండలో నిప్పులు వేసుకుని