ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కిష్కిం____కీడా 475 కీడు____కీర్తి
- "ఆ యింట్లో అన్నీ ఉన్నా మరీ కిష్కింధంగా ఉంటుంది. ఇంతమందీ యెలా ఉండగలం." వా.
కిష్కింధాపురవాసులు
- కోతులలాంటి వారు.
- "ఆ కిష్కింధాపురవాసుల్లో పడితే మన మేం బయటి కొస్తాం? నానా కంగాళీ పట్టించి పంపిస్తారు." వా.
కీచుబిళ్ల
- దిండు; తలగడ. శ. ర.
- చూ. కీచుబుఱ్ఱ.
కీచుబుఱ్ఱ
- 1. దిండు; తలగడ.
- "గిలకల మంచమున్ విరులు నించిన సెజ్జయు గీచు బుఱ్ఱయున్." రాధికా. 1. 10.
- చూ. కీచుబిళ్ల.
- 2. బాలక్రీడావిశేషం. హంస. 3.
కీచు మని పోవు
- చిక్కి పోవు.
- "వా డీమధ్య మలేరియా వచ్చి మరీ కీచు మని పోయాడు." వా.
కీజుపోరు
- ఊరక పోరు.
- "కీలుగం టిది యేల పోలగా నును గొప్పు, గీల్కొప్పు కొమ్మంచు గీజు పోరు." శుక. 2. 457.
కీటడగించు
- పొగ రణచు. కుమా. 11. 151.
కీడాడు
- దుర్భాష లాడు; నిందించు.
- "నను....నీ విట్టులు కీడాడంగ నర్హుండవే." భార. కర్ణ. 3. 86.
కీడుపఱుచు
- చెఱుచు.
- "ధర్మంబు గీడుపఱిచి." భార. భీష్మ. 1. 60.
కీడు పుట్టు
- 1. హాని కలుగు.
- "దాన గీ డెంత వుట్టిన దగిలె నాకు, ననుభవింపక పోవునే." ఉ. హరి. 4. 54.
- 2. చెడు కలుగు.
- "లావున రాక వేఱొక తలంపున వచ్చిన గీడు పుట్టదే." ఉ. హరి. 1. 67.
కీడ్పఱుచు
- అధ:కరించు; క్రిందుపఱుచు.
- "బయలు దామరల గీడ్పఱుచుపాదములు." గౌ. హరి. ప్రథ. పంక్తి. 805.
కీర్తిముఖము
- ముఖాన నుదుటిపై కట్టుకునే తెల్లటిరేకు.
- ఇప్పటికీ రాయలసీమ వీధి నాటకాల వేషాలలో ఇది కట్టుకుంటారు. కీర్తిముఖమనే అంటారు. కోశాలలోని కిది ఎక్కినట్లు లేదు.
- పండితా. ద్వితీ. పర్వ. పుట. 312.
కీర్తిశేషు డగు
- చనిపోవు.
- "శ్రీవారు కీర్తిశేషు లయిరి." వా.