పుట:Paarijathaparahanamu-Nandi.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

శ్రీ గణాధిపతయే నమః

శ్రీ శారాదాంబాయై నమః

పారిజాతాపహరణ

మహాకావ్యవ్యాఖ్యాన మగు

పరిమళోల్లాసమునకుఁ

బీఠిక

శ్రీ కాంతామణికిన్ సురద్రుసుమముం
      బ్రేమంబుతో నియ్య న
స్తోకామర్ష ముఁజెంది మానసమునన్
      శోకించుసత్యాసతిన్
నాకానీతముఁ బారిజాతనగముం
      దా నిచ్చి యూరార్చునా
శ్రీకృష్ణున్ మునివంద్యుఁ బుణ్య చరితున్
      సేవింతు నశ్రాంతమున్. 1

క. ప్రతిపదవిన్యాసచమ
   త్కృతియుతమై సరసవచనమృదుసంశ్లేషాం
   చితమై భావోదయరం
   జితమై యీకావ్యరమణి చెలువారుఁ గడున్ . 2

తే. సరసకవిమానసాహ్లాదకరమృదూక్తి
   భరణమై నీరసగ్రంథపఠనమృదిత
   మోదసహృదయహృదయసంభూతతాప
   హరణ మై పారిజాతాపహరణ మమరు. 3