పుట:Oka-Yogi-Atmakatha.pdf/857

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలిఫోర్నియాలో ఎన్సినిటాస్‌లో

821

1935 నుంచి అక్టోబరు 1936 వరకు) శ్రీ లిన్,[1] ఎన్సినిటాస్ ఆశ్రమ నిర్మాణాన్ని గురించిన సమాచారం నాకు అందకుండా ఆపడానికి, కాలిఫోర్నియా నుంచి నాతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపేవాళ్ళతో కలిసి, ప్రేమపూర్వకంగా పన్నాగం పన్నారు. ఆశ్చర్యం, ఆనందం!

అమెరికాలో ఉన్న తొలిరోజుల్లో నేను, సముద్రపు ఒడ్డున ఒక ఆశ్రమం నిర్మించడానికి అనువయిన చిన్న స్థలంకోసం కాలిఫోర్నియా తీరాన్ని గాలించాను. అనుకూలమైన ప్రదేశం కనిపించినప్పుడల్లా నా ప్రయత్నాన్ని విఫలం చెయ్యడానికి ఏదో ఒక ఆటంకం తప్పకుండా వస్తూ ఉండేది. ఇప్పుడు ఎన్సినిటాస్‌లో ఆహ్లాదకరమైన అనేక ఎకరాల భూమిని తిలకిస్తూ, “సముద్రతీరంలో ఒక ఆశ్రమం” అంటూ చాలాకాలం కిందట శ్రీ యుక్తేశ్వర్‌గారు చెప్పిన జోస్యం ఫలించడం సవినయంగా చూశాను.

కొన్ని నెలల తరవాత, 1937 ఈస్టర్‌లో, కొత్త ఆశ్రమప్రదేశంలోని పచ్చికబయలులో మొట్టమొదటి ఈస్టర్ ప్రభాతసేవ జరిపాను. సనాతన పారశీక పురోహితులలా, అనేక వందలమంది విద్యార్థులు, ప్రతి నిత్యం అద్భుతంగా, ఆకాశంలో తూర్పున ఉదయించే సూర్యబింబాన్ని భక్తిపరవశులయి తిలకించారు. పడమటివేపు, గంభీర ప్రస్తుతితో ఘోషిస్తూ ఉంది పసిఫిక్ మహాసముద్రం; దూరాన పయనిస్తున్న తెల్లటి చిన్న

  1. పరమహంసగారి మహాసమాధి తరవాత శ్రీ లిన్ (రాజర్షి జనకానంద) సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్‌కు అధ్యక్షులుగా పనిచేశారు. గురువుగారిగురించి శ్రీ లిన్ ఇలా అన్నారు: “సాధుపుంగవుని సాంగత్యం ఎంత దివ్యమైనదని! నా జీవితంలో లభించినవాటన్నిటిలోకీ, పరమహంసగారు నా మీద కురిపించిన దీవెనలే విలువయినవిగా గుండెలో పదిలపరుచుకుంటాను.”

    శ్రీ లిన్ 1955 లో మహాసమాధి చెందారు. ( ప్రచురణకర్త గమనిక ).