పుట:Oka-Yogi-Atmakatha.pdf/664

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

628

ఒక యోగి ఆత్మకథ

చివరికి ఈస్ట్-వెస్ట్[1] (తూర్పు-పడమర) అన్న పేరు మాకు ఒప్పుదల అయింది. మళ్ళీ మేము ఆయన అధ్యయన మందిరంలోకి వెళ్ళిన తరవాత బర్బాంక్‌గారు, “సైన్స్ అండ్ రెలిజియన్” (విజ్ఞానశాస్త్రం : మతం) గురించి తాము రాసిన వ్యాసం ప్రతి ఒకటి నాకు ఇచ్చారు.

“ఇది నా ఈస్ట్-వెస్ట్ పత్రికలో ప్రారంభ సంచికలో వస్తుంది,” అన్నాను కృతజ్ఞతాపూర్వకంగా.

మా స్నేహం గాఢతరం అయిన మీదట, బర్బాంక్ గారిని నేను, నా “అమెరికన్ సెయింట్” (అమెరికా సాధువు) అనేవాణ్ణి. “ఇదుగో, ఏ కపటమూలేని మనిషిని చూడండి!”[2] అన్న వాక్యం ఉదాహరించాను. వినయం, ఓర్పు, త్యాగం చిరకాలంగా అలవాటయి ఉన్న ఆయన హృదయం అంతుపట్టనంత లోతు. గులాబీలమధ్య ఉన్న ఆయన చిన్న ఇల్లు అతి నిరాడంబరమైనది; విలాసాల వ్యర్థత, కొద్దిపాటి వస్తువులవల్ల కలిగే ఆనందం ఆయనకు తెలుసు. శాస్త్రరంగంలో తమకు వచ్చిన కీర్తిని ధరించడంలో ఆయన చూపే నమ్రత, పండే పండ్ల బరువుతో కిందికి వంగిన చెట్లను పదేపదే గుర్తుకు తెస్తుంది; పసలేని దాంభికంతో తల పైకి ఎగరేస్తూ ఉండేది గొడ్డుబోతు చెట్టే.

1926 లో నా ప్రియమిత్రుడు గతించినప్పుడు నేను న్యూయార్కులో ఉన్నాను. కళ్ళ నీళ్ళు పెట్టుకొని, “అయ్యో! ఆయన కడసారి చూపుకోసం, ఇక్కణ్ణించి శాంటా రోసా దాకా సంతోషంగా నడిచి వెళ్తాను!” అనుకున్నాను. కార్యదర్శులకూ సందర్శకులకూ దూరంగా

  1. 1948 లో దీని పేరు ‘సెల్ఫ్ రియలైజేషన్ మేగజైన్’ అని మార్చడం జరిగింది.
  2. యోహాను 1 : 47 (బైబిలు).