పుట:Oka-Yogi-Atmakatha.pdf/590

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

554

ఒక యోగి ఆత్మకథ

“ఆనాడు మధ్యాహ్నం, గతజన్మల అనుభూతుల పొందికతో పావనమయిన నా గొంగడి మీద కూర్చున్నాను. నా గురుదేవులు దగ్గరికి వచ్చి నా తలమీద నిమిరారు. నేను నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళి, అందులో అవిచ్ఛిన్నంగా ఏడు రోజులపాటు ఉండిపోయాను. ఆత్మజ్ఞాన స్తరాల్లో ఒకదాని తరవాత ఒకటి దాటుతూ, సత్యస్వరూపుడి అమరసీమల్లోకి చొచ్చుకుంటూ పోయాను. మాయావరణాలన్నీ తొలగి పోయాయి; నా ఆత్మ, విశ్వాత్ముడికి వేదికమీద సంపూర్ణంగా స్థిరపడింది.

“ఎనిమిదో నాడు నేను నా గురుదేవుల పాదాలమీద పడి, నన్ను ఎప్పటికీ తమకు దగ్గరగానే, తమ పవిత్ర వనభూమిలోనే ఉండనిమ్మని వేడుకున్నాను.

“ ‘నాయనా, ఈ జన్మలో నీ పాత్ర జనబాహుళ్యం కళ్ళ ఎదుట నిర్వహించాలి. ఈ జన్మకు పూర్వం అనేక జన్మలు నువ్వు ఏకాంత ధ్యానసాధన భాగ్యం పొందావు; ఇప్పుడు మానవ ప్రపంచంలో కలిసి మసలాలి.’ అన్నారు బాబాజీ నన్ను ఆలింగనం చేసుకుంటూ.”

“నువ్వు వివాహితుడివయి, సామాన్య కుటుంబంతో, ఉద్యోగ బాధ్యతలతో ఉండేదాకా ఈసారి నువ్వు నన్ను కలుసుకోకపోవడంలో గంభీరమైన ప్రయోజనం ఒకటి మరుగుపడి ఉంది. హిమాలయాల్లో మా రహస్య బృందంలో చేరాలన్న ఆలోచనలు నువ్వు పక్కకి పెట్టాలి. నీ జీవితం, ఆదర్శ గృహస్థయోగికి నిదర్శనంగా సేవచేస్తూ నగర జన సమూహాల మధ్య గడవాలి.

“ ‘దిగ్భ్రమ చెందిన అనేకమంది లౌకిక స్త్రీపురుషుల ఆక్రందనలు, మహామహుల చెవుల్లో పడకుండా పోలేదు’ అంటూ ఇలా చెప్పారాయన: ‘మనఃపూర్వకంగా అపేక్షించే అసంఖ్యాకులకు క్రియాయోగం ద్వారా ఆధ్యాత్మిక ఉపశమనం కలిగించడానికి నువ్వు ఎంపిక అయావు. సంసార