పుట:Oka-Yogi-Atmakatha.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

184

ఒక యోగి ఆత్మకథ

తాదాత్మ్యాన్ని నేను పసిగట్టాను; ఆయన శిష్యుడిగా ఈ లాభం కోసం పట్టుబట్టాలని నిశ్చయించుకొని ఉన్నాను.

“బలవంతంగా రాబట్టుకొనే స్వభావం నీది!” ఆ తరవాత, దయతో కూడిన తుదిమాటగా, గురువుగారి సమ్మతి వచ్చింది.

“నీ కోరికే నా కోరిక; కానియ్యి.”

నా హృదయం మీద, జీవిత పర్యంతం కమ్ముకొని ఉన్న మబ్బును తొలగించినట్టయింది. ఇహపరాల్లో ఒక దారీ తెన్నూ లేకుండా నేను చేస్తున్న అన్వేషణ అంతటితో అయిపోయింది. ఇప్పుడు నాకు ఒక సద్గురువు సన్నిధిలో శాశ్వతమైన ఆశ్రయం దొరికింది.

“రా, ఆశ్రమం చూపిస్తాను నీకు.” గురుదేవులు వ్యాఘ్రాసనం మీంచి లేచారు. చుట్టుపక్కల పరకాయిస్తూ, ఒక గోడమీద, మల్లెపూల దండ వేసిన పటం ఒకటి చూశాను.

“లాహిరీ మహాశయులు!” ఆశ్చర్యపోయి అన్నాను.

“ఔను, నా గురుదేవులు!” శ్రీయుక్తేశ్వర్‌గారి గొంతులో భక్తి భావం ఉట్టిపడింది. “మనిషిగానూ, యోగిగానూ ఆయన చాలా గొప్ప వారు. నేను చేసిన జీవిత పరిశీలనల పరిధిలోకి వచ్చిన గురువులందరి కన్న ఆయన మహనీయులు.”

సుపరిచితమైన ఆ పటం ముందు నేను నిశ్శబ్దంగా తల వంచాను. పసితనంలోనే నన్ను దీవించి, ఈ క్షణం వరకు నన్ను ముందుకు నడిపిస్తూ వచ్చిన ఆ అద్వితీయ పరమ గురుదేవులకు నా ఆత్మ జోహార్లు అర్పించింది.

గురువుగారు ముందు నడుస్తూ దారి చూపిస్తుండగా, ఇంట్లోనూ