పుట:Oka-Yogi-Atmakatha.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

ఒక యోగి ఆత్మకథ

ఇంతలో, దౌడు తీసే గుర్రాల డెక్కల చప్పుళ్ళు వినిపించాయి. అవి నా బస కెదురుగా వచ్చి ఆగిపోయాయి. తలపాగాలు పెట్టుకున్న పొడుగాటి పోలీసువాళ్ళు కొందరు లోపలికి వచ్చారు.

“నేను ఆశ్చర్యపడ్డాను. ‘మానవ చట్టం సృష్టించిన వీళ్ళకి అన్నీ సంభవమైనవే,’ అనుకున్నాను. ‘నాకు బొత్తిగా ఏమీ తెలియని విషయాల గురించి దండించబోరు కదా, అనిపించింది.’ కాని ఈ ఆఫీసర్లు అలవాటు లేనంత అతివినయంతో వంగి నమస్కరించారు.

“ ‘అయ్యగారూ, కూచ్ బిహార్ యువరాజావారు వారి తరపున తమకు స్వాగతం ఇవ్వడానికి మమ్మల్ని పంపారు. రేపు పొద్దున తమరు రాజమందిరానికి దయచేయవలసిందిగా వారు కోరుతున్నారు.’ ”

“ఈ పిలుపు ఎందుకయి ఉంటుందా అని కొంత సేపు ఊహించాను. అస్పష్టమైన ఏ కారణంవల్లనో కాని, ప్రశాంతమైన యాత్రకు ఈ అవరోధం కలిగినందుకు మనస్సు చివుక్కుమనిపించింది. కాని పోలీసులు చూపించే వినమ్రభావం నన్ను కదిలించింది; రావడానికి ఒప్పుకున్నాను.

“మర్నాడు, నాలుగు గుర్రాలు పూన్చిన అద్భుతమైన బండిని గుమ్మంలోకి తీసుకువచ్చి అతిమర్యాదలతో నన్ను రాజమందిరానికి తీసుకువెళ్తూ ఉంటే తబ్బిబ్బు అయాను. మలమల మాడ్చే ఎండ నాకు తగలకుండా ఉండాలని ఒక భటుడు, అందంగా అలంకరించి ఉన్న గొడుగు పట్టాడు. నగర వీధుల గుండాను, శివార్లలో ఉన్న వనాల గుండాను కులాసాగా సాగుతూ ఆనందించాను. నాకు స్వాగతం పలకడానికి రాజవంశాంకురమే స్వయంగా, మందిర ద్వారం దగ్గర ఉన్నాడు. బంగారు నగిషీ చేసిన తన ఆసనాన్ని నాకు ఇచ్చి, అంతకంటె సాదా నమూనాలో ఉన్న కుర్చీలో తాను కూర్చుంటూ చిరునవ్వు చిందించాడు.

“ ‘ఈ మర్యాదంతా నాకు తప్పకుండా ముప్పుతెస్తుంది!’ అని,