పుట:Navvulagani-2.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నవ్వుల గని.

లమీద వర్ఛస్సు పోయి పేృతకళలు దిగినవి. ఇవి అన్ని మనకు ఎప్పుడైనా వడలిపోవు యని చూస్తూయున్నాను. నేటి కాలానికి యివన్నీ పుచ్చుకుంటామని యెవరో వకరు వచ్చినప్పుడు సంతోషపూర్వకముగా యిచ్చి వారి కోరిక తీర్చడమే మనపని. అంతేగాని బెంగపెట్టుకొని చావవద్దు. ఇకమీద మనం హాయిగా కోట్లుకమీజులు వేసుకొని తెల్లనిచలవ మడతలు కట్టుకొని జరీ తలగుడ్డలు చుట్టుకొని నీమాజామా వేసుకొని నీటుగా గోటుగా కచ్చేరీలకు వెళ్ళుతూ వేళపట్టుకు 10 గంటలకు హాయిగా భోజనము చేస్తూయుందాము. కాబట్టి మీరు విచారించక మీవాళ్ళకు ఇంగ్లీషు చెప్పించండి.

గణ. శబాష్. బాగా చెప్పినావు నీవు అపరసృష్టి చేసే విశ్వామితృడవు. నీ ఆలోచన పసందుగానున్నది. లౌక్యులను వైదికులను, వైదికులను లౌక్యులను చేయగలవాడవు. చిన్న వాడవయినా నీవు చెప్పే ఆలోచన బాగున్నది. నీవు చెప్పినట్లే నడుస్తాను.

 (అని యిద్దరు నిష్క్రమించుచున్నారు.)