పుట:Navanadhacharitra.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

55

పోకుండ నీయాన ◆ పొడిచిన భయము
పైకొని పాఱెడు ◆ పామైన నణఁగు
నెలనాగ నీకునే ◆ నేచన వొసఁగ
నెలఁత నేఁ డేమిట ◆ నీకు [1]వెర్గంద
నలఁగఁగారణమేమి ◆ యల పూవుఁబోణు
లలుగుదు రొకవేళ ◆ నాత్మనాయకుల
వల పొత్తిచూడ భా ◆ వంబునఁ దలఁచి
కలకంఠి నిను దక్కఁ ◆ గలనైన నొండు
వెలఁది పొందెఱుఁగఁ బూ ◆ విలుతుఁడు సాక్షి
పలుకులేటికి నమ్ము ◆ పచరణ గాదు
ధవళాక్షి నీమోము ◆ దామరపువ్వుఁ
[2]గవవారు మదమధు ◆ కరశాబములును
గురులుఁ జుట్టంబులు ◆ కొదమ చందురుఁడు
దరుణి నీ నుదురును ◆ దగ సందడిల్లు
నిగిడి వీనులఁ దాఁకు ◆ నీలోచనములు
మగబేడిసలుఁ బొత్తు ◆ మను తల్లిప్రజలు
చిలుకలకొలికి నీ ◆ చిగురువాతెరయు
నలబింబఫలములు ◆ ననుఁగు వియ్యములు
ప్రసవసుగంధి నీ ◆ బాహువల్లికలు
బిసకాండములు నొక్క ◆ పేగుబందుగులు
వనిత నీజిగిమించు ◆ వలుదపాలిండ్లు
నొనర జక్కవలును ◆ నొకగూటి పిల్ల
[3]లనువుగఁ బిడికిట ◆ నణఁగు నీనడుము
మనసిజుదేవిదౌ ◆ మధ్య మొకజోక
కలహంసగమన సై ◆ కతములు మించు
తొలఁకు నీ జఘనంబు ◆ తోడఁబుట్టువులు
సరసిజగంధి నీ ◆ సవరని తొడలుఁ
గరితుండములును ద ◆ గ్గఱినబంధువులు
బాలకి నీపాద ◆ పల్లవంబులును
నేలకెందమ్ములు ◆ నెత్తురుఁ బొత్తు
సౌందర్యమున నీకు ◆ సరియెన్నఁ గలరె
చందనగంధులు ◆ జగతిని నెందు

  1. నీకు వెరగంద్ద
  2. గలవారుమధుకర కీరసారములు
  3. లణువన