పుట:Narayana Rao Novel.djvu/293

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

292

నా రా య ణ రా వు

వేలకొలది పురుషులు, స్త్రీలు ఒడలు తెలియక రాక్షసులు చేయతగిన పనులు చేయుచున్నారు. నలిగిపోవుచున్నారు బిడ్డలు, స్త్రీలు.

మహాశక్తివలె యంత్రము దిశల నావరించియున్నది. ఇట్టి ప్రచార చిత్రమునుగూడ నెంత విచిత్రముగ చిత్రించినా డీ శిల్పి!

వర్ణములు, రేఖలు, లోతులు, బరువులు లయ సామ్యసంకలితములై మహోత్కృష్ట శ్రుతిలో లీనమైపోవుచున్నవి.

శిల్పి మహాభాగుడు. ఒక్కగీతంలో, ఒక్కరంగులో ఎన్ని సమూహములు, ధీశాలి కందని లోతులు చిత్రించగలడు!

అత డా చిత్రము తదేకదృష్టితో జూచుచు, అటులనే నిలుచుండి పోయినాడు.