పుట:Naayakuraalu.Play.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

25

గురువుననీ, పాలనకర్తననీ నిన్న మాచర్లలో ప్రకటించుకొన్నాడు. ఇప్పుడు మాచర్లకు నిజమయిన ప్రభువే నాయుడన్నమాట. రాత్రి రాజుగారికి వచ్చిన జవాబులో మన రాజుగారు భయపడవలసిన అవసరము లేదనీ, తాను మాచర్లలోనే వుండి గురిజాలకు పరరాజభయం లేకుండా కాపాడుతాననీ వ్రాసి వున్నది. అంటే, నలగామరాజు వారికి సామంతరా జన్నమాట.

కే : దానినిబట్టి రాజుగారి కంత అర్థం ద్యోతకమయిందా ?

న : దాంట్లో దాపఱిక మేమున్నది? స్పష్టంగానే కనబడ్డది. ఇక బ్రహ్మనాయుడు మంత్రిపదవి స్వీకరించడని నిశ్చయించుకొన్నాడు.

కే: మన రాజుగారు సామంతపదవికి అంగీకరిస్తారా ?

న: అంగీకరిస్తాడు. బుద్ధిపూర్వకంగా అంగీకరించకపోయినా బ్రహ్మనాయుడు బలవంతంగానయినా వొప్పిస్తాడనికూడా అన్నాను. ఉత్తరం కండ్లు తెరిపించింది. ఇప్పుడు తహతహ పడుతున్నాడు.

కే: రాజుగారికి నిజస్థితి తెలియడం మంచిదయింది. నాయుడు వేసిన అంజనం యిప్పటికి దిగింది. మన మార్గం మనం యోచించవచ్చు.

న: మనం ముందుబోయి నాగమ్మగారికి విషయం తెలిపి వుంచితే తాను వేటనెపంమీద గామాలపాటి ప్రాంతాలకు వస్తామన్నారు. ఉభయులకు అక్కడ సమా వేశం గలిగించాలె.

కే: సరే, చీకటితో బయలుదేరుదాం.

(తెర పడుతుంది.)