పుట:Naajeevitayatrat021599mbp.pdf/686

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ష్యుల రాకపోకలను కూడా అడ్డుతున్నారు. అడ్డే వారెవరో, ఎందుకు అడ్డుతున్నారో తెలియదు. కాని నేను అక్కడికి వెల్లేసరికి, నా దుస్తులూ, వేషం చూసి, "నువ్వు కాంగ్రెసువాడివా?" అని హిందీలో అడిగారు. నేను అవునని, నా బస ఆ రోడ్డులో ఉన్నదనే సరికి, నన్ను వెళ్ళనిచ్చారు. అంతలో అక్కడికి వచ్చిన ఒక పోలీసు వాన్ వాళ్ళు అడ్డగించే సరికి తిరిగి వెళ్ళిపోయింది. విప్లవం ఆరంభమయింది.

బొంబాయిలో అన్ని వీథులలోకి ప్రజలు ఈ విధంగా వచ్చేసి రహదారులను బందు చేసేస్తున్నారు. అంతకు ముందు రోజున, శివాజీ పార్కులో జండా వందనం జరుగుతుందని ప్రకటించారు. అక్కడ ముప్పై, నలభై వేల మంది ప్రజలు గుమిగూడారు. హిందువులు బ్రిటిషు దొరల లాగున ధరించిన టోపీలు, నెక్‌టైలు, కాలర్లు; దొరకినంత మట్టుకు విదేశపు బట్టలు; బ్రిటిషు గవర్నమెంటు రాజు, మంత్రుల పేరిట, తయారుచేసిన గడ్డి బొమ్మలు - పెద్ద పెద్ద నాలుకలతో వెలుగుతున్న అగ్నిహోత్రుడికి ఆహుతి చేయబడినాయి. అయినా, ఇంగ్లీషు వారిని ఎవరూ హింసించలేదు. గీర్గాంలో నేను బసచేసి ఉన్న నాగేశ్వరరావు గారింటి ప్రాంతంలో, పది గంటలయ్యేసరికి మెల్ల మెల్లగా రెండువందల అడుగుల కొక పోలీసు కానిస్టేబుల్‌ని నిల్చోబెట్టారు. బొంబాయి పోలీసుల చేతి కర్రలు మనవైపు పల్లెటూరి ప్రజల చేపాటి కర్రలలాగా ఉండేవి. వాటిపైన వారు గడ్డాలు మోపి నిలుచున్నారు. అంతలో మరొక పోలీస్‌వాన్ వచ్చింది. ఎక్కడినుంచో రాళ్ళువచ్చి దానిమీద పడ్డాయి. ఎక్కడినుంచి పడ్డాయి. ఎవరిమీద పడ్డాయి అని ఈ పోలీసువారు పట్టించుకున్నట్టే కనబడలేదు. కొంతసేపటికి ఒక వార్త ఆ ప్రాంతానికి వచ్చింది. - ఒక సార్జెంటు దుర్మార్గం చేసి, ఖద్దరు టోపీతో ఉన్న దుకాణదారుని కొట్టాడని, వందలకొద్ది ప్రజలు మూగి పోయారు. అంతట్లో ఆ కొట్టిన సార్జెంటు ఒంటినిండా కిరసనాయిలు పోసి కాల్చేశారని మరొక వార్త వచ్చింది. ఈ పోలీసువారు మాత్రం కదలక, ఎక్కడి వా రక్కడే నిలబడి ఉన్నారు.

ఆ మహా పట్నంలో ఇంకా ఏం జరుగుతున్నదో చూద్దామనే