పుట:Naa Kalam - Naa Galam.pdf/130

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చివరగా ఒక మాట. నేను ఎప్పుడూ చేప్పే మాటే. "జాతి, మత, కుల, వర్ణ, వర్గ, స్త్రీ, పురుష విభేదాలకు అతీతమైన, మానవుడు మానవునిపట్ల మానవుడుగా వ్యవహరించే మానవీయ వ్యవస్థ మన లక్ష్యం కావాలి".


"ఎవరీ తుర్లపాటి"

"మీరు పత్రికా రచనారంగంలో 40 సంవత్సరాలు పూర్తిచేసిన సందర్భంలో మీకు నా అభినందనలు. గతంలోకి చూచుకుంటే మీరు ఆనందించండం సహజమే. కాని, ప్రఖ్యాత బ్రిటీషు జర్నలిస్టు బ్రౌనింగ్‌ అన్నట్టు, గతంలో కంటె భవిష్యత్తులోకి చూడటం అవసరం. మీరు జీవితంలో మరింత ఉన్నత విజయాలను సాధించాలని కోరుకుంటున్నాను."

- ప్రధాని రాజీవ్‌ గాంధి

"గార్డియన్‌ ఆఫ్‌ తెలుగు"

- రాజాజీ
ఇండియా మాజీ గవర్నర్‌ జనరల్‌

Naa Kalam - Naa Galam Page 129 Image 0001

"పత్రికా నిర్వహణలో కుటుంబరావు దిట్ట ; సభా నిర్వహణలో దక్షుడు ; జంకూ గొంకూ లేకుండ మాట్లాడే ఉపన్యాసకుడు."

- 'ఆంధక్రేసరి' టంగుటూరి ప్రకాశం

"ఆధునిక రాజకీయ జర్నలిస్టులలో అందెవేసిన చెయ్యి, యువతరానికి మార్గదర్శకుడు."

- మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి