పుట:Naa Kalam - Naa Galam.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా పేరును శాసన మండలికి 1978, 1980 సంవత్సరాలలో నాకు తెలియకుండానే ప్రతిపాదించింది - డాక్టర్ చెన్నారెడ్డి; తిరిగి 2007 లో నా నామినేషన్‌ కోసం పట్టుబట్టింది నేను కాదు, డాక్టర్ రాజశేఖరరెడ్డి గారే! మరి ముగ్గురు ముఖ్యమంత్రులు కావాలని కోరినా, ఎందుకు జరగలేదు? దీనిలో ఎన్నో జీవిత సత్యాలున్నాయి! అలాగే ఆ ముగ్గురు ముఖ్య మంత్రులు శాసనమండలి సభ్యత్వం తప్పిపోయినప్పుడల్లా, ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ పరిషత్తు చైర్మన్‌ బాధ్యతను అప్పగిద్దామనుకుంటూ వచ్చారు! కాని, ముగ్గురి హయాంలోను అది పొసగలేదు!

చివరికి, నాల్గవ ముఖ్యమంత్రి శ్రీ కె. రోశయ్య హయంలో నేను దాదాపు ప్రయత్నమంటూ చేయకుండానే ఆ బాధ్యత నాకు లభించడం మరో విశేషం కాదా? శ్రీ రోశయ్య ముఖ్యమంత్రి పదవి మాత్రం? శ్రీ పి.వి. వలెనే, తాను కూడా ఇక ఎన్నికలలో పాల్గొననని ఆయన 2008 లో ప్రకటించారు. కాని, శాసనమండలి సభ్యత్వం ఆయనను వెతుక్కుంటూ వస్తే, కలలో కూడా అనుకోని ముఖ్యమంత్రిత్వం స్వయంగా వరించింది! ఆ పిమ్మట కొద్ది కాలానికి కీలకమైన తమిళనాడు గవర్నర్‌ పదవి రావడం మరింత విశేషం! యోగ్యత, యోగం రోశయ్యగారి కవలపిల్లలు!

నా పరోక్షంలో నాకు గవర్నర్‌ సన్మానం :

నేను పాత్రికేయ జీవితంలో ప్రవేశించి 2007 మార్చికి సరిగా 60 సంవత్సరాలు ! అది నా జర్నలిస్టు జీవిత వజ్రోత్సవ సంవత్సరం. నా జర్నలిస్టు జీవితంలో ప్రతి పది సంవత్సరాలకు మిత్రులు సన్మానాలు చేస్తూనే ఉన్నారు. పెరల్‌ జుబిలీ (30), 40 సంవత్సరాలు, గోల్డెన్‌ జుబిలీ (50) జరిగాయి. డైమండ్‌ జుబిలీ (60) జరపాలని "సృజనప్రియ" పత్రికా సంపాదకుడు శ్రీ నీలం దయానందరాజు, తదితర మిత్ర బృందం నిర్ణయించారు. ఎట్టకేలకు