పుట:Naa Kalam - Naa Galam.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చినా, ఏవో కారణాల వల్ల అవి కార్య రూపం ధరించలేదు. ఒకసారి సోషలిస్టు నాయకుడు శ్రీ మధు లిమాయే అలాంటి చట్టం "వ్యక్తి స్వేచ్ఛ"కు భంగమనే కారణంతో ఆ బిల్లును అడ్డుకున్నారు. అక్కడితో ఆ బిల్లు అటక ఎక్కింది - లోక్‌ పాల్‌ బిల్లువలెనే.

1970 దశకంలో నేను ఆనాటి ప్రముఖ జాతీయ నాయకులు లోక్‌ నాయక్‌ శ్రీ జయప్రకాష్‌ నారాయణ్‌, "కాశ్మీర్‌ కేసరి" షేక్‌ అబ్దుల్లా, జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ చంద్ర శేఖర్‌ ప్రభృతులకు పార్టీల మార్పిడి బిల్లుపై వారి అభిప్రాయాలు ఏమిటని ప్రశ్నించగా, వారందరు కూడా ఆ బిల్లు కోసం తాము ఎదురు చూస్తున్నామని, అలాంటి బిల్లును తాము తప్పక స్వాగతిస్తామని సమాధానమిచ్చారు.

తరువాత ఆ లేఖలను 1985లో ప్రధాని రాజీవ్‌ గాంధికి పంపాను. శ్రీ రాజీవ్‌ గాంధి పార్టీల మార్పిడి బిల్లు కోసం గట్టిగా ప్రయత్నించి, ఎట్టకేలకు 1986లో పార్టీల మార్పిడి చట్టాన్ని తీసుకు వచ్చారు. అయితే, ఆ బిల్లులో కొన్ని లొసుగులు లేకపోలేదు. మరి, అన్ని పార్టీలు, అన్ని వర్గాల వారి అభిప్రాయాలను సమన్వయ పరచడానికి జరిగిన ప్రయత్నం వల్ల ఆ చట్టం ఇప్పటి రూపం ధరించింది! ఈ చట్టాన్ని ఇంకా కఠిన తరం చేస్తే కాని, దాని నుంచి ఆశించిన సమగ్ర ఫలితం లభించదు.

నా మనుమడు రాసిన నా జీవిత చరిత్ర :

నా కుమారుడు జవహర్‌లాల్‌ పుత్రుడు కృష్ణ కుమార్‌ ఇంగ్లీషు కాన్వెంట్‌లో చదివాడు. అయితే, అతను మేధావి. నా ప్రభావం అతని పై ఎక్కువ పడింది. నా సభలు, సమావేశాలు, నన్ను కలుసుకొనడానికి వచ్చే వారితో నేను జరిపే చర్చలు - ఇవన్నీ అతడిని కొంతవరకు ప్రభావితుని చేశాయి. జాగ్రత్త పరుడు, వస్తుతః తెలివిగలవాడు కావడం వల్ల తెలుగు