112
నా జీవితకథ - నవ్యాంధ్రము
రావుబహద్దరు బిరుదును ప్రసాదించుచు ఆయన బెజవాడ మ్యునిసిపలు చైరుమనుగ చాల పనిచేసినాడనియు, అంతేగాక బెజవాడలో కొందరు బ్రిటిషుప్రభుత్వమును పడగొట్టి ఒక రిపబ్లికును స్థాపించవలెనని ప్రయత్న ములు చేయగా వాటిని ఆయన ప్రతిఘటించి బ్రిటిషుప్రభుత్వమునకు చాల సహాయముచేసినాడనియు, అందువలన ఆయనకు ప్రభుత్వమువారు రావు బహద్దరుబిరుదమును ప్రసాదించుచున్నారనియు చెప్పి, ఆ బిరుదమును ప్రసాదించెను. రాజారాంరావుగారికి రావుసాహేబు బిరుదమును ప్రసాదించుచు ఆయనకూడ బెజవాడలోని కొందరు దుండగీడులు బ్రిటిషు ప్రభుత్వమును పారద్రోలీ రిపబ్లికును స్థాపించుటకు చేసిన కుట్రలను కను క్కొని ఎప్పటికప్పుడు ప్రభుత్వయుద్యోగస్తులకు తెలుపుచు ప్రభుత్వమునకు గొప్పసేవచేసినందున ఆ బిరుదమొసంగబడినదని చెప్పెను. బ్రిటీషు సామ్రాజ్యవాదియగు ఆ ఉద్యోగస్తుడు అంత పొగరుబోతుతనముతో చెప్పిన మాటలను శాంతముగా విని యింటికి వచ్చినాము.
1908 లో తెనాలివద్ద కఠేవరములో నొక బాంబు ప్రేల్చబడెను. ఎవరికిని దెబ్బలు తగులలేదు. దానిని కోటంరాజు రాజేశ్వరరావు తయారు చేసి ప్రేల్చినాడని పోలీసువారు అనుమానపడి ఆయనను, మరోయిద్దరిని అరెస్టుచేసి కొంతకాలము జైలులోఉంచిరి. పిమ్మట సాక్ష్యములేనందున విడుదలచేసిరి.
1909 సంవత్సరం ఫిబ్రవరిలో నరసారావుపేటతాలూకా కోటప్ప కొండవద్ద జరిగిన శివరాత్రియుత్సవమునకు అదివర కేటేట జరిగినటులే వేలకువేలప్రజలు పోగైరి. వారిలో చాలమంది మంచి మంచి ఎద్దులను బాగుగా నలంకరించి ప్రభలుకట్టుకొని వచ్చిరి. అటులనే చిన్నప్పరెడ్డియను రెడ్డినాయకుడు అతనిమిత్రులు మంచిఎద్దులతో గొప్పప్రభలను కట్టుకొని వచ్చినారు. పోలీసు హెడ్డుకానిస్టేబిలు ఇతర కానిస్టేబిలులు లాఆర్డరు అను పేరుతో ప్రభలుకట్టితెచ్చినవారిమీద అనవసరముగ దౌర్జన్యముచేయుచు త్రోవలు సరిగానుండవలెనని మనుష్యులను, ఎడ్లను బెత్తములతో కొట్ట సాగిరి. ఈవిధముగనే చిన్నప్పరెడ్డిమీద దౌర్జన్యముచేసి అతనిఎద్దులను కొట్టగా అవి బెదరి స్వాధీనముతప్పేస్థితిలోకి రాసాగినవి. అందుమీద