6
ఉ. జారిగకీర్తియైన రఘు రాము చరిత్రము మున్ గవీశ్వరుల్
తేజ మొలర్ప జెప్పిరని తెల్సియు గ్రమ్మర జెప్ప నేలనన్
భూజనకల్పకం బగుచు భుక్తికి ముక్తికి మూల మైనయా
రాజును దైవమైన ర్ఘు రాము నుతించిన్ దప్పు గల్గునే.............................. 21
క. వారాంగన శ్రీరాముని
పేరిడి రాచిలుక బ్ ఇలిచి పెంపు వహించెన్
నేరువు గల చందంగున
నారాముని వినుతి ఏయ హర్షము రాదే... .........................................22
క. నేరిచి పొగడిన వారిని
నేరక కొనియాడు వారు నిజ కృపయమునపం
గారణమగుటకు భ్క్తియె
కారణ మగు గాని, చదువు కారణమగునే.............................................23
ఉ. సల్లలిత ప్రతాపగుణ సాగరుడై విలసిల్లి ధాత్రి పై
బల్లిదుడైన రామ నర పాలకునిన్ స్తుతి సేయ జిహ్వకున్
జిల్లర రాజలోమనును జేకొని మెచ్చగ నిచ్చ పుట్టునే
నల్లము బెల్లముందినుచు నప్పటి కప్పటి కాస సేయునే...........................24