ఈ పుట ఆమోదించబడ్డది
భూమిక
వ్రాయించియుంచిన వ్రాఁతప్రతితో నచ్చుపడియున్న పుస్తకమును సరిచూడఁగా నెన్నోస్థలములయందుఁ జాల వ్యత్యయములు గన్పట్టుటయే కాక యచ్చటచ్చటఁ గొన్నిపద్యములు గూడ నాయచ్చువడ్డప్రతిలో లేవు. కాఁబట్టి శుద్ధముగా మా తండ్రిగారు వ్రాయించి యుంచినప్రతి యూరక పోనేలయనియు నిందలి విశేషములను జదువరులు దిలకింప వలయు ననియు బ్రకృత మీరామాయణమును మఱి రెండువ్రాఁతప్రతులతోఁ గూడ సంప్రతించి ముద్రింపించితిని.
చెన్నపురి. |
ఇట్లు, |