పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

85

ఈశ్లోకము రాయలు నందిదుర్గమున సోమశంకరస్వామికి నాలయము కట్టించినప్పుడు చెక్కించినశాసనమం దున్నది. ఆశాసనము వ్రాఁతప్రతి ప్రాచ్యలిఖితపుస్తకశాలలో నున్నది. కృష్ణదేవరాయఁడు రచించినదిగా జాంబవతీకల్యాణ మని సంస్కృతనాటక మొకటి కలదు. తంజావూరులైబ్రరినుండి దాని ప్రతిని గొనివచ్చి శ్రీమానవల్లి రామకృష్ణకవి గారు చెన్నపురిలైబ్రరికొసంగిరి. దానిలోఁ బ్రస్తావన కొంత గ్రంథపాతములు గలిగి యున్నది. గ్రంథకర్త కృష్ణరాయఁ డనియే యం దున్నది. కాని గ్రంధాంతమం దీశ్లోక మున్నది

శ్లో|| శేషక్ష్మాధరనాయకస్య కృపయా సప్తార్ణవీమధ్యగాం
      రక్షన్ గామిహ కృష్ణరాయనృపతి ర్జీయా త్సహస్రం సమాః

ఈ నాటకము ప్రాకృతబహుళమై సంస్కృతచ్చాయు లేక గ్రంథపాతములతో నున్నది. కాన ససిగా ముద్రించుట దుష్కరము. దీని నేను జదివితిని. కృష్ణుఁడు జాంబవతిని బెండ్లాడుట యిందలికథావస్తువు. కథానాయకుc డగుకృషఁడు కృష్ణదేవరాయఁడుగాను, నాయిక యగుజాంబవతి ప్రతాపరుద్రగజపతి కుమార్త యగుభద్రాదేవిగాను నాకు స్ఫురించినది. ఈదృష్టితోఁ జాడఁగా నాటక మెల్ల శ్రీకృష్ణదేవరాయలకథను జెప్పునదిగా సమన్వయింపఁదగినట్లు నాకు గోచరించినది. అయినను నీవిషయ మింకను బరిశోధింపఁదగినది.

- 2 -

కృష్ణదేవరాయలు సాహిత్యమందే కాక సంగీతమందును మిక్కిలి యభిరుచి గలవాఁడు. ఈయన యాస్థానమున బండారు లక్ష్మీనారాయణుఁ డని యొక సంగీతవిద్వాంసుఁ డుండెను. రాయల యంతఃపురస్థానమున నాయన నాట్యరసాధిపత్యము వహించి యుండెడువాఁడు. ఆతఁడు