పుట:Manimalikalu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36.

నువ్వుఋణపడుండాలి కన్నీటికి
నిన్నొదుల్తూ నీ బాధనొదిలిస్తోంది

37.

మనుషుల్ని గురుపట్టాలంటే
ముందు నువ్వు మనిషివి అయ్యుండలిగా

38.

మానవత్వం కాలి బూడిదవుతుంటే
చీకట్లో కవితల్రాసుకోడానికి వెలుగడిగాట్ట

39.

కిలకిలరావాల్తో నిద్దర లేచాను
చూస్తే మాఅవిడ నవ్వుతోంది

40.

మంచి, చెడు
నువ్వటు చూసి, నేనిటు చూసి

41.

ఎందుకలా నువ్వుపట్టిన కుందేలుకి మూడు కాళ్ళంటావు?
అదేటీ ఏకుందేలుకైనా మూడు కాళ్ళేగా ఉంటా

42.

ఓడిపోతే చిన్నతనమా?
కాదు ఒకపాఠం ఎక్కువ అనుభవం

43.

ఏదీ ప్రేమించలేని మనసెందుకు
తిరిగి ఆశించే బతుకెందుకు

44.

ఇంతోిటి దానికి విరించెందుకు?
మనమే రాసుకుంటే పోలా?

45.

నన్ను నేను తవ్వుకుంటే
నాకు నేను దొరికాను

మణి మాలికలు జ శ్రీనివాస్‌ యల్లాప్రగడ

89