పుట:Manimalikalu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem> 16.నేనో వలస పక్షిని

 మనుష్య తీరం నుంచి...ఎక్కడ వాలాను ఇంతకీ?

17.భూతం, వర్తమానం, భవిష్యం...అంతామంచే

  నాల్గు మాటల గీతా సారం

18.కూసింత దారి చూపించరూ

  తప్పిపోయా..రత్నగర్భ భారతదేశానికి

19.జ్ఞాపకాల అరలు ఈ రోజు ఆత్రంగా తడుముతుంటే

  అన్నీ ఖాళీలే..నువ్వెలా వదిలేసి వెళ్ళావో అలాగే

20.దుప్పటి నిండా అవినీతి చిరుగులే

  పేదరికం చలేస్తోందని ప్రభుత్వదుప్పటి కప్పుకుంటే

21.ఎందుకలా తేరిపార చూస్తావ్‌

  నువ్వేగా క్రితం జన్మలో పునర్జన్మలో మళ్ళీ కలుస్తానన్నావ్‌

22.నే ప్రపంచంలో లేను

  ప్రపంచమే నాలో ఉంది

23.అన్వేషించు

  కానీ అది నీతో ఆరంభించు

24.

అనుకున్నది చెయ్యి తగిలితే సరే..లేకుంటే అనుభవం

25.మరణం

 జీవితానుభవ విరామం


87 మణి మాలికలు: శ్రీనివాస్‌ యల్లాప్రగడ