పుట:Manimalikalu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆశయసాధాన సకారాత్మక దిశలో!

అందుకే నా హృదాయాన్ని ఈ మణిమాలికలు అంతగా చూరగొన్నాయి!
ఈ మణిమాలికలను సాటి మానవుల, చదువరుల కష్టాలను ఆనంద డోలికలు గాను, కరదీపికలుగాను మార్చి నీలో మంచిని అలాగే ఉంచుకో... రోజుకొక మంచి చొప్పున ఇంకా నీలో పెంచుకో అన్న చందాన సాగిస్తూ కవితా వ్యవసాయం చేస్తున్న అనేకమంది నా సోదర సోదరీమణులు వెలయిస్తున్న మణిమాలికా కవితల విలువ
ఇంత అని చెప్పగలమా?

ఓ ఇరవై సంవత్సరాల లోపు కుర్రాడి మాలిక చదివాను...ఇతనిలో ఇంత
మానసిక పరిపక్వతా? అని ఆశ్చర్యపోయాను! మరో మధ్య వయస్కుని మాలిక చదివాను కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి... అమ్మ గురించిన మధురానుభూతితో..! మరో సోదారి మాలిక చదివాను ప్రతిరోజు ఆ మాలికను మెడను ధరించకుండ మెదడున స్మరించకుండ ఉండలేక పోతున్నాను..

అనేకమంది సోదరీమణులు కూడ మణిమాలికలల్లడం కడు శ్లాఘనీయం! యత్రానార్యస్తు పూజ్యంతే నిజం చెప్పొద్దు నేను స్త్రీ పక్షపాతిని! ఏ ప్రతిభ నాలోవుండి
ఈ ముందుమాట వ్రాస్తున్నానో నాకు తెలియదు కానీ... ప్రతి మణిమాలిక ఓ గతకాల గమనిక, ఓ వర్తమాన ప్రచలగీతిక! ఓ భవిష్యకాల అభ్యుదయవేదిక అని ప్రగాఢంగా విశ్వసిస్తూ...

భవదీయుడు

సాహితి
సినీ గీత రచయిత

16