పుట:Mana-Jeevithalu.pdf/5

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1986లో ఫిబ్రవరి 17న అమెరికాలోని ఒహాయిలో తుదిశ్వాస వదిలేవరకు, 60 స॥ల పాటు యూరప్, అమెరికా, లాటిన్ అమెరికా, శ్రీలంక, భారతదేశాలలో నిర్విరామంగా పర్యటించి ప్రసంగించారు. అసంఖ్యాకమైన ప్రజలను ప్రభావితం చేశారు.

ద్వేషాలూ, అసూయలూ, సంఘర్షణలూ, జాతి మత విభజనలూ లేని ఒక నూతన ప్రపంచాన్ని నిర్మించాలంటే విద్యావిధానంలోనే మార్పురావలనే దృక్పథంతో ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, కెనడాలలో విద్యాసంస్థలను స్థాపించారు.

దర్పణంలా మనల్ని మనమే పరిశీలించుకునే అవకాశం కల్పించే ఈ జీవిత వ్యాఖ్యానాలు తెలుగు పాఠకులలో నవ్య నూతనమైన జీవనదృష్టిని వెలిగిస్తాయని ఆశిస్తున్నాము.


డా. గజానన రావు

సమన్వయ కర్త

దక్షిణ భాషల అనువాద విభాగం

కృష్ణమూర్తి ఫోండేషన్, ఇండియా.


వసంత విహార్

చెన్నై - 600 028.