ఎన్ని గుండుసూదులు వేయగలరని అడగండి ! రెండు మూడు అని సమాధానం చెపుతారు. మీరు అంతకంటే ఎక్కువ వేస్తానని చెప్పండి ! వారు ఎన్ని చెప్పినా అంతకంటే ఎక్కువ వేస్తానని ధైర్యంగా చెప్పవచ్చు ! ఎందుకంటే మీరు వంద గుండు సూదులు వేసినా నీరు క్రిందపడదు. గ్లాస్ రాకాసిలా గుండుసూదుల్ని మింగుతుందేగాని నీటిని కింద పడనీయదు ! అయితే గుండుసూదుల్ని నీటిలోకి వదిలేటప్పుడు - తలభాగాన్ని పైకివుంచి, మొనభాగాన్ని క్రిందకు వుంచి, చాలా నిదానంగా నీటిలోకి వదలాలి. అలా వందకుపైన గుండు సూదులను వేసినా నీరు క్రిందపడదు. గ్లాస్ మూతి ఎంత వెడల్పు వుంటే అంత మంచిది.
దివ్య దృష్టి
పదిమంది స్నేహితులతో సరదాగా గడిపేటప్పుడు ఈ తమాషాచేసి అందరిని ఆశ్చర్యపరచవచ్చు. ఈ తమాషాను ఏ సమయంలోనైనా చేయవచ్చు. ఎందుకంటే దీనికి ప్రత్యేకమైన పరికరములు ఏమీ అవసరంలేదు.
మీ స్నేహితులు పదిమందికి ఒకే సైజు తెల్ల కాగితములు ఇచ్చి, పరిశీలించమని చెప్పి, వాటిని తిరిగి తీసికొని వారిని ఒక్కొక్కరిచే - వారికి ఇష్టమైన పేరు ఏదైనా సరే చెప్పమనండి ! ఒకరు ఒక పేరు చెప్పగానే - ఒక తెల్ల కాగితంపై దానిని వ్రాసి మడతవేసి - ఒక టోపిలోగాని, డబ్బాలోగాని వేయండి ! అలాగే మిగిలిన మిత్రులు చెప్పినవిగూడా తెల్ల