పుట:Mahendrajalam.djvu/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఎంతమంటతో కాల్చినా కాగితం కాలదు

న్యూస్ ప్రింట్ కాగితం లేక బ్లాటింగ్ పేపరును సేకరించాలి. పటికను పొడిగొట్టి, నీటిలో చిక్కగా కలిపి ఆ కాగితాన్ని తడిపి (5 - 20 సార్లు) ఎండబెట్టి దగ్గర వుంచుకోవాలి. ప్రేక్షకులెవరినయినా పిలిచి ఆకాగితాన్ని తగల పెట్టమని చెప్పాలి. వారు ఆ కాగితాన్ని ఎంత కాల్చినా మండదు. ఈ ప్రదర్శన చాల అద్బుతంగా వుంటుంది.

పాలు - పంచదార - టీపొడి లేకుండా టీ

బాగా కండ కలిగిన మంచి ఉసిరికాయలు - ఆవుపాలు లేక గేదె పాలు లో వేసి బాగా ఉడికించాలి. ఆ తరువాత ఎండ బెట్టి మెత్తగా చూర్ణం చేసి దానిలో టీ పొడి, సువాసనకు ఏలకుల పొడి వేసి మరలా బాగా నూరి పొడిచేసి కొంచెం చాక్రెన్ గాని, గ్లూకోజ్ గని కలిపి వుంచుకొని - ప్రదర్శన సమయంలో స్టౌ మీద వేడి నీళ్ళు మరగించి - దానిలో ఈ పొడిని (మంత్ర భస్మంగా భ్రమింపజేసి) వేసిన చక్కిని టీ తయారవుతుంది. ఇది చూచు వారికి చాల విచిత్రంగా వుంటుంది.

నాణెమునకు చుట్టిన దారము ఎంత మంట పెట్టినా కాలదు

నాణెమునకు దారం గట్టిగా కట్టి వ్రేలాడదీయాలి. తరువాత ప్రేక్షకులను పిలిచి నా మంత్ర మహిమతో - మీరు నాణెమును కాల్చినా వ్రేలాడే దారం తప్ప నాణెమునకు