ఈ పుట ఆమోదించబడ్డది
80
మహాపురుషుల జీవితములు
యత్యంతమైన దేశాభిమానముగల సత్పురుషుఁడు. మనయార్యుల గొప్పతనమును మనమతముయొక్క ప్రాశస్త్యమును లోకమునకు వెల్లడిచేయవలయునని బాల్యమునందె సన్యసించి ఖండాంతరములకు బోయి చక్కగా పనిచేసెను. ఈయన సంకల్పములన్నియు నెరవేరకమున్నె మన దురదృష్టమున బాల్యమునందె పరలోకగతుడయ్యెను. ఈయన శిష్యులగు నభేదానందస్వామి శారదానందస్వామి మొదలగువారు వానిమార్గము ననుసరించియే పనిచేయుచున్నారు.