[41]
తండాళం గోపాలరావు
321
గొంత ప్రవేశముగల దేవాజీరా వనునతఁడు గోపాలరావున కింగ్లీషులోఁ బ్రవేశముఁ గలిగించెను. కాలచక్రమమున నాంగ్లేయభాష నితఁడు తన వశము చేసుకొనుటకు స్వయంకృషివల్ల నేగాని పరసహాయము చేతగాదు. ఆతఁడు మరణమొందుటకు నాలుగేండ్లక్రిందట నొకరితో నిట్లు చెప్పెను. 'నాచదువొక పాఠశాలలోఁగాని కళాశాలలోఁగాని నేర్చుకొన్నదికాదు. నేనుపదునై దేండ్ల వాఁడనైనప్పుడు నాపాట్లు నేఁబడి నేర్చికొన వలసినవాఁడనైతిని. ఆభాషాప్రవేశము మొట్టమొదట నాకొకపల్లెటూరిలోనైనది. ముప్పదియై దేండ్లక్రిందట పల్లెటూళ్ళలో నెంతపాటి యింగ్లీషు విద్య యుండునో మీరే యూహించుకొనుఁడు. పశ్చిమఖండ భాషలు ప్రకృతిశాస్త్రములు నేనునేర్చికొనుట పరసహాయ మెంతమాత్రములేని నాస్వయంకృషి వల్ల నేః స్వయంకృషి యనినచో నందతిశయోక్తి యేమియు లేదు. నాపుస్తకములు మాత్రమే నాగురువులు."
పదునేడేండ్లు ప్రాయమువాఁ డైనప్పుడు గోపాలరావు తంజావూరు కలక్టరుకచ్చేరిలో నుద్యోగముసంపాదించుకొని రెండుసంవత్సరములు ముగియకమునుపె యొక యింజనేరు కచ్చేరిలో మేనేజరయ్యెను. ఈయుద్యోగమున నతఁడు మూడు సంవత్సరము లుండెను. ఆకాలములో నట్టి యుద్యోగస్థుల కెంతెంత లాభముండెడిదో విస్తరించి వ్రాయనక్కర లేదు. గోపాలరావు తానున్న మూడేండ్లలో శక్యమైనంతవఱకు లంచగొండుతనము నణచుటకుఁ బ్రయత్నము చేసెను. చెన్నపట్టణపు హైకోర్టులో జడ్జియై చాల ప్రసిద్ధికెక్కిన హాలోవే దొర యాకాలమున దంజావూరుజిల్లాలో నసిస్టంటు కలక్టరుగానుండి గోపాలరావుయొక్క ధర్మతత్పరత సామర్థ్యము గనిపెట్టి చాలమెచ్చి తానుచెన్నపట్టణమునకు వచ్చినపిదప గోపాలరావునకుఁ జాల సహాయము చేసెను. 1854 వ సంవత్సరమున గోపాలరావు