పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/288

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
237
సర్ సయ్యద్ మహమ్మదుఖానుగారివద్ద వానికి సాయబుమునిషీ పని యయ్యెను. 1841 వ సంవత్సరమం దతనిని దొరతనమువారు సిక్రీపట్టణమున మునసబుగా నియమించిరి. 1846 సంవత్సరమున మునసబుగానే ఢిల్లీకి బోయి పని చేసెను. 1850 సంవత్సరమందు వానికి రహతుకుపట్టణమున సబుజడ్జీపని యయ్యెను. సిపాయి పితూరి జరుగుటకు రెండేండ్లముందు దొరతనమువారు వానిని బిజనూరునకు మార్చిరి. అతఁ డక్కడ నుండగానే యాపితూరీ బయలు దేరెను. ఆసమయమున నతఁడు గవర్నమెంటువారికి జేసిన యమితోపకారమునుబట్టి వానికీర్తియంతయు హిందూస్థానమందంతట వ్యాపించెను. పితూరీ బయలుదేరిన వార్త తెలియునప్పటికి బిజనూరులో నింగ్లీషువారుస్త్రీలు పురుషులు బాలురు గలసి యిరువదిమంది యుండిరి. షేక్స్పియరను నొక దొర యాగ్రామము వారిలో గొప్పయుద్యోగస్థుఁడు. పితూరీదారులు కనబడిన తెల్లవారినెల్ల నరుకుచుండుటచే నా తెల్లవారుభయబ్రాంతులై యుండ నహమ్మదుఖాను నూరుమంది పటాను గుఱ్ఱపురౌతులను సిద్ధముచేసి పితూరీని గూర్చి నిజమైనవార్త నెప్పటికప్పుడు తెలియుటకు నమ్మికగల వేగులవాండ్రను బెట్టెను. కాని యా పటానులు శయితము పితూరీదార్లతోగలసి కుట్రచేయుటచే నొక నాడాయిరువది మంది తెల్లవారిని పితూరీదారు లెనిమిదివందలమంది వచ్చి చుట్టుముట్టిరి. అహమ్మదుఖాను దొరల నివాసము రహస్యముగ ప్రవేశించి వారితో సత్వరముగ నాలోచన చేసి తాను స్వయముగ పితూరీదారుల సేనాధిపతి యొద్దకుఁబోయి తెల్లవారిని వీరోపాయముగ బారిపోవనిమ్మని వేడుకొనెను. ఆ సేనాపతియు నా ప్రాంతభూమి ఢిల్లీ చక్రవర్తి స్వాధీనము చేసినట్లు తెల్లవారిలో ముఖ్యులు పత్రములు వ్రాసియిచ్చినయెడల జోవనిత్తుమని చెప్పి యట్లు వ్రాయించుకొని వారిని బోవనిచ్చెను. ఆ పత్రము వ్రాయించునపు డహమ్మదు