పుట:Madhavanidanamu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

న్యము (రోగసమకరమునందు వానిలో స్వతంత్రపరతంత్రరోగముల నిర్ణయించుట), బలము, (నిదానపూర్వరూపాదులచే రోగబలాబలము), కాలము (రాత్రి, పగలు మున్నగుకాలము), అను నంప్రాప్తిభేదముల నరయక చికిత్సల నిర్ణయింప వలనుపడదు. కావున సంప్రాప్తియు నావశ్యకము.

ఇత్తెరంగున నిదానాదు లైదిటికిని వేర్వేర ప్రయోజనము నెరుంగునది. మరియు నిదానశబ్దమునకు పైజెప్పంబడిన వ్యుత్పత్తిచే వ్యాధిని దెలుపు నుపాయములు నిదానపూర్వరూపౌపశయనంప్రాప్తులన్నియు నగుటంజేసి యన్నిటికిని నిదానము అనుపదముచే వ్యవహారము కలదు. అయినను విశేషవివక్షచే వ్యాధికి సుకృత్తి కారణములగు మిధ్యాహారవిహారాదులే ప్రాయికముగ నిదానపదముచే గ్రహింపనగును.

నిదానలక్షణము

నిమిత్తహేత్వాయతనప్రత్యయోత్ధానకారణై:, నిదానమాహు: పర్యాయై:

ఏరోగమైనను జనించుటకు మొట్టమొదట నెయ్యది కారణ మగునో, అయ్యది ఆయా రోగములకు నిదాన మనంబడును. అట్టి నిదాన మనునది నిమిత్తము, హేతువు, ఆయతనము, ప్రత్యయము, ఉత్ధానము, కారణము నుప పర్యాయపదములచే నీశాస్త్రమున వ్యహరింపబడును. లోకమున "ఇంద్ర:, మరుత్వాన్, మభునా" ఇది మున్నగు పర్యాయపదములచే 'ఇంద్రుడు ' అనేవ్యక్తి యెట్లు బోధింపబడునో, ఆరీతిగ పైచెప్పబడిన నిమిత్తాదిపర్యాయములచె నీశాస్త్రమున నిదానము బోధింపబడునో, ఆరీతిగ పైచెప్పబడిన నిమిత్తాదిపర్యాయములచె నీశాస్త్రమున బోధింపబడునని భావము.

"నేతికర్తవ్యతాకో రోగోత్పాదకహేతుర్నిదానమ్" అని *కొందరాచార్యులు నిదానలక్షణమును నుడివిరి. ఇట్టి కారణమువలన బుట్టినవ్యాధి కెత్తెరంగున చికిత్సచేయ


  • ఈ సంగ్రహలక్షణమును మధుకోశవ్యాఖ్యయందు విజయరక్షితుడు వ్రాసియుండెను.

దీనియర్ధ మీక్రిందిరీతి నందగలదని తెలియవలెను. "అజ్గజాతమేదేత్ధంభావ ఇతి, ఇతికర్తవ్యచేతి చోచ్యతే" అని8 మీమాంసకవాక్యము. దానిని వారు "ఈవిధముగా నగుననిది" యను కార్యములో నట్టిది యేయే విధములతో గూడి యుండునో ఆవిధములైన యంగము లితికర్తవ్యత యనబడును అని వివరించిరి.

ప్రకృతమున నిదానలక్షణమును జెప్పుచు "నేతికర్తవ్యతాక:" ఇట్టి యంగములుకదలగు "రోగోత్పాదక హేతు:" రోగోత్పత్తిని గలిగించుకారణము నిదాన మని యర్థము చెప్పు టుతిచము. అట్టియంగము లెవ్వియనగా నహారావిహరాదికము, రోగ