పుట:Lokokthimukthava021013mbp.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

712 ఒక్కకొడుకని ముద్దుగాచూస్తే మిద్దెయెక్కి వెశ్యలను చూచినాడట

713 ఒక్కకొడుకు కొడుకుకాడు ఒకకన్ను కన్నూకాదు

714 ఒక్కనాటి భాగవతమునకు ఉన్నమీసాలు గొరిగెనట

715 ఒక్కడి సంపదన పదిమందిపాలు

716 ఒక్కొక్కరాయి తీస్తూవుంటే కొండలైనా తరుగుతవి

717 ఒళ్లువంగనమ్మ కాలిమట్టెలకు కందిపోయిందట

718 ఒళ్లు వంగనివాడు దొంగలో కలిసెనాడట

719 ఒళ్లువాచినరెడ్డీ, వడ్లు యేమిధర అంటే అవిలేకనే నా వొళ్లు వాచిందనాడట

720 ఒళ్లెరుగని శివము మన సెరుగని కల్ల వున్నదా?

721 ఒకడు తింటే మరిఒకడు వాంతిచేసుకున్నట్లు

722 ఒకగబెట్టి తాగేది చరచరాకంచరాడు

723 ఒక చెంప కొట్టితేపాలు ఒకచెంపకొట్టితే నీళ్లు

724 ఒక చేత పసుపు ఒకచేత ముసుగు

725 ఒక్కప్రొద్దుమాట కుక్కయెరుగునా

726 ఇళ్ళంతా తడిసినవెనుక వోపలేనివానికైనా చలిలేదు