పుట:Lokokthimukthava021013mbp.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1714 తలగేటిజున్ను

1715 తనవారిని యెరగని మొఱ్ఱితెడ్డు ఉన్నదా

1716 తాడు అని యెత్తిపారవెయ్యనూ కూడదు పాము అని దాటనూ కూడదు

1717 తిట్టేనోరు కొట్టినా వూరుకుండదు

1718 తింతలు తూతింవే తూనీతానే తాత్తి తూతిక తాతకతోనా దొందుదొందె

1719 దండమయ్యా బాపనయ్యా అంటే మీతండ్రిపాత బాకీ యిచ్చి పొమ్మన్నడట

1720 దండుగకు రూపాయలు తద్దినానికి కూరలు పోగుకాకుండా పోవు

1721 దండుగ భాగవరము

1722 దంపినమ్మకు బొక్కినదే కూడు

1723 దంపుళ్ళ పాటకు దండుగ లేదు

1724 దండులోకి పోతే రెంటిలొ ఒకటి

1725 దగ్గితే నిలవనిమొక్క తుమ్మితే నిలచునా

1726 దగ్గిరకు పిలిచి దాసరీ నీకన్నులొట్టా

1727 దత్తతమీద ప్రేమా దాయాదిమీద ప్రేమా

1728 దద్తపుత్ర శోకము

1729 దమ్మిడీ గుర్రం దుమ్ము రేపినట్లు