ఈ పుట ఆమోదించబడ్డది
56
15. అకర్మక ధాతువులకు, అప్రేరణంబున కర్తయగునని ప్రేరణంబున కర్మయగును.
సామాన్య వాక్యము | -ప్రేరణార్థక వాక్యము |
చెట్లు పెరిగెను | -చెట్లను పెంచెను. |
విల్లు విరిగెను | -వింటిని విరిచెను. |
హృదయము భేదిల్లెను | - హృదయమును భేదించెను. |
16. గతి - బుద్ధి - వ్రత్యవసానార్థ శబ్దకర్మంబులకు అప్రేరణంబున కర్తయగునది ప్రేరణంబున కర్మయగును.
పోవు - పొందు | -గత్యర్థకములు. |
తెలియు - ఎరుగు | -బుద్ధ్యర్థకములు. |
తిను - మ్రింగు | -ప్రత్యవసానార్దకములు |
విను - చదువు - చెప్పు | -శబ్దకర్మములు. |
రాముడింటికిపోయెను | -తండ్రి రామునింటికి పంపెను. |
నాకు మంచి తెలియును | -మిత్రుడు నాకు మంచి తెల్పెను. |
నేను చదివితిని | -తండ్రి నన్ను చదివించెను. |
నీవన్నియును తింటివి | -తండ్రి నిన్ను అన్నమును తినిపించెను. |
17. అప్రధాన కర్తకు ఒకానొకచో కి - కు లు బహుళముగా కాన్పించును.
ఇంద్రుడు తత్వమును దెలిపెను
బ్రహ్మ ఇంద్రునకు తత్వమును దెలిపెను.
రాముడు మిధిలను జూచెను.
విశ్వామిత్రుడు రామునకు మిధిలను చూపించెను.
సులభ వ్యాకరణము