పుట:KutunbaniyantranaPaddathulu.djvu/66

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 66

ఒకవేళ వచ్చి, లూప్‌ని తొలగించడం కుదరనప్పుడు ఆ స్త్రీ గర్భం కొనసాగించడానికి ఇష్టపడకపోతే అబార్షను చేసి గర్భంలో ఎదుగుతున్న పిండాన్ని, దానితో పాటు లోపల వుండిపోయిన లూప్‌ని తీసివేయవచ్చు. అంతేగాని ఆ స్త్రీకి గర్బాన్ని కొనసాగించి మానసిక వేదనని కలిగించ నవసరం లేదు.

అరుదుగా కొందరికి గర్బం గర్భాశయంలో కాకుండా అండం ప్రయాణించే ఫెల్లోఫియన్ ట్యూబులలో అండ వాహికలలో ఏర్పడుతుంది. అలా ఏర్పడిన పిండం అండవాహికల్లోనే ఎదుగుతుంది. పిండం ఎదుగుతున్నపుడు ఫెల్లోఫియన్ ట్యూబు పగిలిపోయి ప్రాణాపాయం కలగవచ్చు. గర్భాశయంలో కాకుండా ఫెల్లోఫియన్ ట్యూబులలో (అండవాహికల్లో) గర్భం వచ్చే సంఘటనలు లూప్ వేయించుకున్న వాళ్లల్లో మామూలుగా కంటే ఆరు రెట్లు ఎక్కువ. దీనికి ముఖ్య కారణం లూప్ వల్ల గర్భాశయంలో పిండం నిలవడానికి అనుకూల పరిస్థితులు లేకపోవడమే. అందువల్ల అండంతో కలయిక పొందిన వీర్యకణం అండంగా తయారై ఫెల్లోఫియన్ ట్యూబులో పెరగా లనుకుంటుంది.

లూప్ దానంతటకదే జారిపోతుందా ?

లూప్ వేయించుకున్న వారిలో నూటికి 2 నుండి 10 మందిలో లూప్ వేయించుకున్న మొదటి సంవత్సరంలోనే