Jump to content

పుట:KutunbaniyantranaPaddathulu.djvu/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 54

రెండింటిని పట్టుకుని నిదానంగా లాగితే లూప్ గర్భాశయంలోనుంచి బయటకు వచ్చి వేస్తుంది. లూప్‌ని లాగివేయడం చాలా సుళువు. అరుదుగా కొందరికి దారాలు వచ్చేసి లూప్ అసలు బాగం గర్భాశయం లోపలే ఉండిపోతుంది. అటువంటప్పుడు మత్తు ఇచ్చి గర్భాశయ కంఠాన్ని కాస్త వెడల్పు చేసి దానిని తీసివేయవలసి వస్తుంది.

లూప్‌ని ఎవరిమట్టుకు వారు వేసుకొవచ్చా ? తీసేసుకోవచ్చా ?

లూప్‌ని ఎవరి మట్టుకు వారు వేసుకోవడం, తీసేసుకోవడం కుదరదు. డాక్టరు అందుబాటులో ఉంటే డాక్టరే లూప్ వేస్తారు. అవసరం లేదనుకున్నప్పుడు డాక్టరే తీసేస్తారు. డాక్టరు అందుబాటులో లేకపోయినా కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో శిక్షణ ఇచ్చిన మిడ్‌వైవ్స్, నర్సులు, శిక్షణ పొందిన కుటుంబనియంత్రణ కార్యకర్తలు లూప్ వేయడం తీయడం చేస్తారు.

లూప్ ఎప్పుడు వేయాలి ?

స్త్రీ బహిష్టు అయిన తరువాత వారం రోజుల లోపు లూప్ వేయాలి. లూప్ వేయించేలోగా దంపతులు దాంపత్య సంబంధాలలో పాల్గొనకుండా ఉండటం మంచిది.