Jump to content

పుట:KutunbaniyantranaPaddathulu.djvu/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 40

వడం మొదలు పెట్టాను. కాని అది కడుపులో త్రిప్పుతుంటే ఒక నెల కూడా పూర్తిగా వాడకుండా మధ్యలోనే మానివేశాను. ఇలాంటి పరిస్థితివల్ల రెండు మూదు రొజులే రతిలో పాల్గొన్నా ఆనందం లేకుండా భయం భయంగా పాల్గొనవలసి వస్తోంది. అందుకని నాకొక సలహా కావాలి. నాకు గాని, మా వారికి గాని ఇబ్బంది లేకుండా, ఇద్దరం కలుసుకున్నప్పుడే వాడే బిళ్ళలు ఏవో తెలియజేయండి. అవి వాడుతూ హాయిగా గర్భం రాకుండా కాపాడుకుంటాం. నా మానసిక వేదనని అర్ధం చేసుకోండి" అంటూ తన మానసిక వేదనని వ్యక్తపరిచింది.

ఎప్పుడో ఒకసారి రతిలో పాల్గొంటూ గర్భంరాకుండా జాగ్రత్తపడాలంటే "టుడే" వజైనల్ పెసరీ బాగా ఉపయోగపడుతుంది. వజైనల్ పెసరీ అంటే యోనిలోపలి వాడే బిళ్ళ. "టుడే" బిళ్ళ గర్భం రాకుండా నిర్భయంగా వాడవచ్చు. దంపతులు రతిలో పాల్గొనడానికి పది నిముషాల ముందు ఒక బిళ్ళని యోని లోపలికి పెట్టుకోవాలి. వ్రేలుద్వారా పూర్తిగా లోపలికి పోయేటట్లు నెట్టుకోవడం అవసరం. యోని లోపలికి ప్రవేశపెట్టుతున్న ఈ బిళ్ళ 10 నిమిషాల్లో కరిగిపోతుంది. ఇలా కరిగిపోయిన బిళ్ళ గర్భం రాకుండా వీర్యకణాలని నిర్మూలిస్తుంది. అయితే ఈ బిళ్ళ గంటసేపే పనిచేస్తుంది. గంట తరువాత మళ్ళీ రతిలో పాల్గొ