పుట:KutunbaniyantranaPaddathulu.djvu/157

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 157

తిరిగి ఆపరేషను చేయించుకున్న వారిలో నూటికి 60-70 మందికి సంతానం మళ్ళీ కలుగుతుంది. ట్యూబోప్లాస్టీగాని, రీకెనలైజేషన్ గాని కాంప్లికేటెడ్ ఆపరేషన్లు కాదు. అయితే ఆపరేషను చేయించుకున్న ప్రతీ ఒక్కరికీ తిరిగి తప్పక సంతానం కలుగుతుందనే హామీ లేదు.

పురుషులలో వేసెక్టమీ ఆపరేషను చేయించుకున్న తరువాత తిరిగి సంతానం కొరకు రీకెనలైజేషన్ చేయించు కుంటే ఆపరేషన్ సక్సెస్ అవడమనేది ఒక ముఖ్యమైన విషయం మీద ఆధారపడి ఉంది. వేసక్టమీ చేయించుకున్న తరువాత తిరిగి త్వరలోనే రీకెనలైజేషన్ ఆపరేషను చేయించుకుంటే సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ. అలా కాకుండా వేసెక్టమీ చేయించుకున్న అనేక సంవత్సరాల తరవార సంతానం కొరకు తిరిగి ఆపరేషను చేయించు కుంటే సంతానం కలిగే అవకాశాలు తక్కువ. ఎందుకంటే వేసక్టమీ చేయించుకున్న తరువాత నిదానంగా వీర్యకణాలని ఉత్పత్తి చేసే సెమిన్ ఫెరస్ ట్యూబ్యూల్స్ పనిచేయడం మానివేస్తాయి. అందుకని తగినన్ని వీర్యకణాలు లేక గర్భం రాదు. ఒక్కొక్కసారి ఆపరేషను విజయవంతంగా జరిగినా ఆపరేషన్ చేసిన చోట తిరిగి మార్గం మూసుకుని పోవచ్చు దీనితో సంతానం కలుగకుండా అయిపోతుంది. ఇలా మూసుకుని పోవడము మనేది తిరిగి ఆపరేషను చేయించుకున్న స్త్రీలలో ఫురుషులలో ఇద్దరిలోనూ జరగవచ్చు.

* * *