పుట:KutunbaniyantranaPaddathulu.djvu/142

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 142

ఇంటి దగ్గర కాన్పు అయినపుడు, కాన్పు విషయంలో పూర్తి శ్రద్ధ తీసుకోవడం జరగదు. ఎంతో శ్రద్ధ తీసుకున్నామని వారు భావించినా బాక్టీరియా క్రిములు స్త్రీ జననేంద్రియాల్లోకి ప్రవేశించుతాయి. నాటు మంత్రసాని చేతులకి శుభ్రమైన గ్లౌవ్స్ వేసుకుని కాన్పు చేయకపోవడం వల్లగాని డైనర్స్ పరిశుభ్రమైనవి ఉపయోగించకుండా మామూలు గుడ్డలు వాడటంవల్లగాని, డెట్టాల్‌తో రోజూ డూష్ ఇవ్వక పోవడంవల్లగాని, యాంటీబయాటిక్స్ వాడకపోవడం వల్లగానీ బాక్టీరియా క్రిములు యోనిమార్గంలోనికి ప్రవేశిస్తాయి. నిదానంగా అవి పైకి పయనించి గర్భాశయాన్ని, దానికి రెండు ప్రక్కలా ఉండే ట్యూబులకి వ్యాధిగ్రస్తం చేస్తాయి. వ్యాధిగ్రస్తమైన ట్యూబులు వాయడం కూడా జరుగుతాయి. వాపువల్ల పొత్తి కడుపులో నొప్పి, జ్వరం వస్తాయి. తెల్లబట్ట కూడా అవుతుంది. కాన్పులో అశుభ్రతవల్ల ఈ లక్షణాలు కొందరిలో రెండు మూడు రోజుల్లో కలిగితే మరికొందరిలో రెండు మూడు వారాలపాటు పట్టవచ్చు ఇలాంటి పరిస్థితికి అవకాశం ఉన్న ఇందిరలాంటి వాళ్ళు ఆపరేషన్ చేయించుకుని దానివల్లనే ఈబాధలన్నీ కలిగాయని భావిస్తారు. అయితే ఆపరేషను చేయించుకున్నప్పుడు సరైన యాంటీబయోటెక్ సరైన మోతాదులో పుచ్చుకోవడం జరిగితే పై బాదలు కలగకుండా పోవచ్చు. బాక్టీరియా క్రిములు నిర్మూలింపబడటానికి సరిపోయినంత మోతాదులో మందు పడనప్పుడు బాధలన్నీ నెమ్మదిగా బయట పడతాయి.