14. డీప్ ఎక్స్ రే పద్ధతి
అందానికి మారుపేరు ఛాయాదేవి అని చెప్పుకోవచ్చు నేమో! అంత చార్మింగ్‌గా ఉండే ఛాయాదేవికి నిండా యిరవై సంవత్సరాలైనా నిండకుండానే పెళ్ళి అయిపోవడము, ఇద్దరు పిల్లలు పుట్టేయడము కూడా అయిపోయింది. ఇంతటితో పిల్లలు పుట్టకుండా పుల్‌స్టాప్ పెట్టేయాలని నిశ్చయించుకున్నది. ఇంజక్షన్ సూది అంటేనే అదిరిపడే ఛాయాదేవి మనసులో ఆపరేషన్ అనే భావం రాగానే బెదిరిపోయింది. ఆపరేషనుకి బదులుగా మరో మార్గం లేదా అని ఆలోచిస్తూ వుండగా ఎవరో చెప్పినమాట ఒకమాట ఎంతో ఊరట కలిగించింది. వారు చెప్పిన ప్రకారము పిల్లలు వద్దనుకుంటే ఆపరేషను లేకుండా ఆపుచేయవచ్చు. అంతేకాదు, పిల్లలు పుట్టడము ఆగిపోవడముతోపాటు నెల నెలా వచ్చే బహిస్టులు కూడా లేకుండా అయిపోతాయి. పిల్లలతో, నెల నెలా బహిస్టులతో సతమతమయ్యే స్త్రీలకు ఇంతకంటే మంచిమాట మరొకటి ఏమి ఉంటుంది? ఇలా ముచ్చటపడిపోయిన ఛాయాదేవికీ ముడుపు చెల్లించుకుని ఇక ముందు ముట్లు లేకుండానూ, మూడవసంతానంమాట లేకుండానూ కరెంటు పెట్టించుకుని వచ్చింది. ఇంతముచ్చటపడిన