పుట:KutunbaniyantranaPaddathulu.djvu/110

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 110

వరకు రోజూ ఉదయంపూట నిద్రనుంచి లేవగానే ధర్మామీటరుని నోటిలో పెట్టుకుని రెండు నిమిషాలు ఉంచుకోవాలి. తరువాత నోట్లోనుంచి ధర్మామీటరుని నోట్లోనుంచి తీసి టెంపరేచరు ఎంత ఉందో ఒక కాగితం మీద నోట్ చేయాలి. టెంపరేచరు చూసుకునే వరకు బెడ్ దిగకూడదు. ఏ పనీ చేయకూడదు. నోట్లో వేడినీళ్ళుగాని, చన్నీళ్ళు గాని పోసుకోవడం చేయకూడదు. అలా నోట్ చేసిన టెంపరేచర్‌ని కాగితం మీద ఆ రోజు తారీఖు వేసి దానికి ఎదురుగా వేయాలి. టెంపరేచర్‌ని నోట్ చేసిన తరువాత ధర్మామీటరుని విదిలించి, పాదరసం నార్మల్ కంటే ఇంకాతక్కువ లెవెల్ ఉండేటట్లుచూసి చన్నీళ్ళతో దానిని కడగి భద్రంగా దాచి పెట్టాలి. ఇలా రోజూ ఉదయం టెంపరేచర్ చూస్తూ తిరిగి బహిస్టు కనబడే వరకు ఆ నెలది నోట్ చేయాలి.

సాధారణంగా మొదట కొద్దిరోజులు శరీర ఉష్ణోగ్రత 97.6 లేక 98 డిగ్రీల ఫారన్ హీట్ ఉంటుంది. ఇలా ఉన్న ఉష్ణోగ్రత అకస్మాత్తుగా 98.6 లేక 99 డిగ్రీల ఫారన్ హీట్ కి పెరుగుతుంది. ఈ పెరిగిన ఉష్ణోగ్రత 10 - 12 రోజులు అలాగే కొనసాగుతుంది. తరువాత తగ్గిపోయి రెండు మూడు రోజుల్లో బహిస్టు స్రావం కనబడుతుంది.

అకస్మాత్తుగా ఉష్ణోగ్రత పెరిగిన రోజు అండం విడుదలైనదానికి గుర్తు అండం విడుదలైన దగ్గర నుంచి శరీర